Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : అందాల ఎల్లోరా శిల్పంలా...!

బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడంతో పాటు, పలు ప్రత్యేక పాటల్లో తన అందాలతో అలరించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ.

By:  Ramesh Palla   |   25 Aug 2025 12:31 PM IST
పిక్‌టాక్ : అందాల ఎల్లోరా శిల్పంలా...!
X

బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడంతో పాటు, పలు ప్రత్యేక పాటల్లో తన అందాలతో అలరించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ. హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సౌత్‌లోనూ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆధరణ, అభిమానం సొంతం చేసుకున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాల ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా నోరా ఫతేహీ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఆకట్టుకుంది. నోరా ఫతేహీ తాజాగా ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ వీడియో షూటింగ్‌ సందర్భంగా సెట్స్ లో తీసిన ఫోటోలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ ఫోటోలను ముద్దుగుమ్మ షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.


వీడియో ఆల్బమ్‌లో నోరా ఫతేహీ

ఓహ్‌ మామా టెటెమా.. అంటూ సాగే పాటలో నోరా ఫతేహి అందంతో పాటు, డాన్స్ ప్రతిభ ను కనబర్చి కన్నుల విందు చేసింది. తక్కువ సమయంలోనే 20 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకోవడం ద్వారా నోరా ఫతేహీ క్రేజ్‌ ఏంటో చెప్పకనే చెప్పింది. కన్నుల విందు చేసే విధంగా ఉన్న ఈ పాటలో నోరా ఫతేహీ విభిన్నమైన అల్ట్రా మోడ్రన్ డ్రస్‌లు వేయడంతో పాటు, స్కిన్ షో చేసింది. అందంతో పాటు, డాన్స్‌ కలగలిపిన ఈ పాటతో నోరా ఫతేహా ఒక్కసారిగా తనవైపు అందరి దృష్టిని తిప్పుకుంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం కామన్‌గా చూస్తూ ఉంటాం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా నోరా ఫతేహి ఆకట్టుకుంది. నడుము, నాభి అందం చూపించడం ద్వారా కవ్విస్తున్న ఈ అమ్మడు నిజంగా ఎల్లోరా శిల్పం అన్నట్లుగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


బాహుబలి ఐటెం సాంగ్‌తో పాపులర్‌

తెలుగు ప్రేక్షకుల ముందుకు టెంపర్‌, బాహుబలి 1, కిక్‌ 2 సినిమాలతో వచ్చిన నోరా ఫతేహి ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలకు పరిమితం అవుతోంది. గత ఏడాది మట్కా సినిమాతో వచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం దక్కలేదు. తెలుగులో ఈమె ఇకపై ఎక్కువగా కనిపించకూడదని భావిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఒక ఫిల్మ్‌ మేకర్‌ ఈమెను ప్రత్యేక పాట కోసం సంప్రదించిన సమయంలో సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. హిందీలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఈమె సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోల్లో కనిపించడం ద్వారా రెగ్యులర్‌గా నోరా ఫతేహీ వార్తల్లో ఉంటుంది.


బిగ్‌బాస్ షో తో ఎంట్రీ

ఈ కెనడియన్‌ డాన్సర్‌ హిందీ బిగ్ బాస్‌ షో ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా డాన్స్ షో లోనూ పాల్గొనడం ద్వారా హిందీ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. బాలీవుడ్‌లో ఈమె మొదట్లో సత్యమేవ జయతే సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా దిల్‌రుబా పాట యొక్క రీమేక్‌ చేయడం ద్వారా ఒక్కసారి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ పాట 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను రాబట్టడం ద్వారా నోరా ఫతేహి స్టార్‌ అయింది. కేవలం ఇండియన్ భాషల్లోని మ్యూజిక్ వీడియోలు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనూ మ్యూజిక్ వీడియోలు చేయడం, అంతర్జాతీయ స్థాయి స్టేజ్‌లపై సందడి చేయడం ఈమెకు కామన్‌. అందుకే ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉంటుంది. అందుకే ఈమె ఏం షేర్‌ చేసినా వెంటనే వైరల్‌ అవుతుంది.