Begin typing your search above and press return to search.

బార్బీ బొమ్మలా మారిన జాన్వీ!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దివంగత నటీమణి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ దంపతుల వారసురాలు జాన్వీకపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   27 Oct 2025 9:44 AM IST
బార్బీ బొమ్మలా మారిన జాన్వీ!
X

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దివంగత నటీమణి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ దంపతుల వారసురాలు జాన్వీకపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టకు ముందు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఈమె.. పలు యాడ్స్ లో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే అక్కడ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.





ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది . ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోవర్స్ ను కలిగి వున్న జాన్వీ కపూర్ దీనిద్వారా బాగానే ఆర్జిస్తోందని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈఎంఐలు కడుతున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది కూడా. ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసిన జాన్వీ కపూర్ అందులో ఎల్లో కలర్ మినీ ఫ్రాక్ ధరించి అచ్చం బార్బీ బొమ్మలా కనిపించింది.






అమ్మడి అందానికి అభిమానులే కాదు ఫాలోవర్స్, నేటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. జాన్వీకపూర్ ఎలాంటి డ్రెస్ వేసినా మరింత అందంగా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూనే.. మరొకవైపు గ్లామర్ లుక్కుతో ఆకట్టుకునే ఈమె ఇప్పుడు ఏకంగా బార్బీ లుక్ లో కనిపించేసరికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి చెందిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.





జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇటీవల టాలీవుడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాతో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కాబోతోంది. అలాగే నాని ది ప్యారడైజ్ సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం అందుకుంది జాన్వి కపూర్.





ఇటు బాలీవుడ్ విషయానికి వస్తే.. పరమ్ సుందరి, సన్నీ సంస్కారికీ తులసీ కుమారి , హోమ్ బౌండ్ అంటే వరుసగా మూడు చిత్రాలు చేసింది. కానీ ఏ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. ఇప్పుడు థక్త్ అనే మరో చిత్రంలో నటిస్తోంది. మరి ఈ సినిమా నైనా ఈమెకు బాలీవుడ్లో మంచి విజయాన్ని అందిస్తుందో ఏమో చూడాలి.