Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : కాశ్మీరీ స్టైల్‌లో జాన్వీ అందాల షో

ప్రముఖ మ్యాగజైన్‌ వోగ్‌ ఇండియా తమ కవర్‌ పేజ్‌ పై ఎప్పటికప్పుడు అందమైన ముద్దుగుమ్మలను చూపించడం పరిపాటిగా వస్తుంది.

By:  Ramesh Palla   |   10 Sept 2025 10:00 PM IST
పిక్‌టాక్‌ : కాశ్మీరీ స్టైల్‌లో జాన్వీ అందాల షో
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ సినిమాలతో పెద్దగా వార్తల్లో నిలవకున్నా, ఆమెకు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కమర్షియల్‌గా బిగ్‌ బ్రేక్ రాకున్నప్పటికీ బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు రావడంకు ప్రధాన కారణం అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలు అనడంలో సందేహం లేదు. నెట్టింట ఈమె షేర్ చేసే ఫోటోలు ఎప్పడూ వార్తల్లో జాన్వీ కపూర్‌ పేరును నిలుపుతున్నాయి. అందుకే జాన్వీ కపూర్‌ కి బాలీవుడ్‌ క్రేజీ హీరోల నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయి. తనకు ఆఫర్లు తెచ్చి పెడుతున్న ఫోటో షూట్స్‌ ను ఎందుకు జాన్వీ కపూర్ వదులుకుంటుంది. అందుకే వారంలో కనీసం నాలుగు ఐదు ఫోటో షూట్స్ అయినా సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


వోగ్‌ ఇండియా మ్యాగజైన్‌ పై జాన్వీ కపూర్‌

ప్రముఖ మ్యాగజైన్‌ వోగ్‌ ఇండియా తమ కవర్‌ పేజ్‌ పై ఎప్పటికప్పుడు అందమైన ముద్దుగుమ్మలను చూపించడం పరిపాటిగా వస్తుంది. జాన్వీ కపూర్ గతంలో పలు సార్లు వోగ్‌ కవర్‌ పై కనిపించింది. ఈసారి మళ్లీ వోగ్ ఇండియా వారు జాన్వీ కపూర్‌ను తమ కవర్‌ పై చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి కశ్మీరీ స్టైల్‌ ఔట్‌ ఫిట్‌ ద్వారా జాన్వీ కపూర్‌ను చూపించేందుకు ప్రయత్నం చేశారు. వోగ్‌ ఇండియా వారు ఈ ఫోటోలను షేర్‌ చేసి జాన్వీ కపూర్‌ పై ప్రశంసలు కురిపించారు. ఈ ఫోటోలతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో వోగ్‌ ఇండియా వారు... జాన్వీ కపూర్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు కాశ్మీరీ వారసత్వాన్ని తీసుకువచ్చింది, అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన రేషమ్ చీరలో, రియా కపూర్ వింటేజ్ జామావర్ ముక్కలతో స్టైల్ చేసింది. ఆమె లుక్ అప్‌సైకిల్ చేసిన వస్త్రాలు మరియు చేతితో పూర్తి చేసిన వివరాల ద్వారా సాంప్రదాయ మూలాంశాలను తిరిగి ఊహించుకుంది. కాశ్మీరీ డెఝూర్ నుండి ప్రేరణ పొందిన చేతితో తయారు చేసిన సిల్క్ రేషమ్ టాసెల్స్ మరియు వెండి చెవిపోగులతో అలంకరించబడిన పురాతన జామావర్ శాలువాతో ఈ లుక్ జత చేయబడింది. ఆమె తన చిత్రం హోమ్‌బౌండ్ ప్రీమియర్‌కు హాజరయ్యారు అంటూ పోస్ట్‌ చేశారు.


పరమ్‌ సుందరితో జాన్వీ కపూర్‌ అసంతృప్తి

జాన్వీ కపూర్‌ ఇటీవలే పరమ్‌ సుందరి సినిమాతో సిద్దార్థ్‌ మల్హోత్రకు జోడీగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాపై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌ సాంగ్‌ను వదిలిన తర్వాత జాన్వీ కపూర్‌ అభిమానులు సైతం ఈసారి జాన్వీకి బాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ లభించబోతుంది అన్నారు. కానీ ఎప్పటిలాగే ఈ సినిమా సైతం జాన్వీ కపూర్‌కి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి నటన ప్రతిభ కనబర్చడంతో పాటు, అందాలను చూపిస్తూ బిగిబిగీ సారి సాంగ్‌లో నెక్ట్స్ లెవల్‌ స్కిన్ షో చేసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఆకట్టుకునే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలని తేలిపోయింది. అందుకే జాన్వీ కపూర్‌ పరమ్‌ సుందరితోనూ నిరాశను మిగిల్చింది.


రామ్‌ చరణ్‌ కు జోడీగా పెద్ది సినిమాలో..

ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్‌ మూవీ సన్నీ సంస్కారీకి తులసి కుమారి సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతోంది. వరుణ్‌ ధానవ్‌ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలోనూ జాన్వీ కపూర్‌ అందాల షో నెక్ట్స్ లెవల్‌ అన్నట్లుగా ఉంది. అందుకే జాన్వీ కపూర్‌తో ప్రత్యేకమైన పాటను చేయించడం ద్వారా సినిమా స్థాయిని పెంచారు. మరో వైపు తెలుగులో సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే దేవర సినిమాలో ఎన్టీఆర్‌ కి జోడీగా నటించింది. ఆ సినిమా ఫలితం జాన్వీ కపూర్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు పెద్ది సినిమా ఫలితం ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.