Begin typing your search above and press return to search.

పెళ్లికూతురు గెటప్ లో వెలిగిపోతున్న జాన్వీ.. కొంపతీసి నిజమేనా?

అప్పట్లోనే తన అందం,అభినయంతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకొని.. అతిలోకసుందరిగా అందరినీ ఆకట్టుకుంది దివంగత నటీమణి శ్రీదేవి.

By:  Madhu Reddy   |   9 Sept 2025 11:28 AM IST
పెళ్లికూతురు గెటప్ లో వెలిగిపోతున్న జాన్వీ.. కొంపతీసి నిజమేనా?
X

అప్పట్లోనే తన అందం,అభినయంతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకొని.. అతిలోకసుందరిగా అందరినీ ఆకట్టుకుంది దివంగత నటీమణి శ్రీదేవి. ఈమె తదనంతరం కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఎప్పుడు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా పెళ్లికూతురు గెటప్ లో కనిపించి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అంతేకాదు కొత్త అనుమానాలకు కూడా తెరలేపింది ఈ ముద్దుగుమ్మ.


తాజాగా సోషల్ మీడియా వేదికగా పెళ్లికూతురు గెటప్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్, అభిమానులు సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ కలర్ లెహంగాలో అందుకు తగ్గట్టుగా జువెలరీ ధరించి అచ్చం పెళ్ళికూతురులా రెడీ అయింది. ఈమెను చూసిన ఫాలోవర్స్ తన తల్లి శ్రీదేవిని మించిన అందంతో జాన్వీ ముస్తాబయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోలకు జాన్వి కపూర్ కింద క్యాప్షన్ గా.. "కొన్ని క్షణాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. కానీ అవి ఎందుకు మీతో ఉన్నాయి అనే విషయం మీకు అర్థం కాదు. కానీ ఆ అనుభూతులను ఆస్వాదించడమే మీ పని" అంటూ క్యాప్షన్ జోడించింది.. మొత్తానికి అయితే ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇకపోతే మరికొంతమంది ఈ ఫోటోలు చూసి పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్ గత కొంతకాలంగా ప్రముఖ నటుడు శిఖర్ పహారియాతో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. కొంపతీసి పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే ఈ గెటప్ వేసుకుందా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇందులో ఎలాంటి నిజం లేకపోయినా ఆమె సడన్గా పెళ్లికూతురు గెటప్ లో కనిపించేసరికి కొంతమంది అత్యుత్సాహం తట్టుకోలేక ఇలాంటి కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.


ప్రస్తుతం జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. 2018లో ధడక్ అనే సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టిన జాన్వీ..2024 లో ఎన్టీఆర్ నటించిన దేవర మొదటి భాగంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. తన అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం

రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. అలాగే హీరో నానితో కూడా ఒక సినిమాలో నటించడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో ఇటీవలే 'పరమ్ సుందరి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వీ కపూర్.