Begin typing your search above and press return to search.

ప్రతీ లుక్ ఒక స్టోరీ చెబుతుంది.. అందాలతో ఆకట్టుకుంటున్న దంగల్ బ్యూటీ!

సెలబ్రిటీలు చాలామంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని.. తమ హాట్ అందాలతో సినిమా ఆఫర్లను, ఫాలోవర్లను పెంచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

By:  Madhu Reddy   |   2 Sept 2025 3:00 AM IST
ప్రతీ లుక్ ఒక స్టోరీ చెబుతుంది.. అందాలతో ఆకట్టుకుంటున్న దంగల్ బ్యూటీ!
X

సెలబ్రిటీలు చాలామంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని.. తమ హాట్ అందాలతో సినిమా ఆఫర్లను, ఫాలోవర్లను పెంచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో హీరోయిన్లు ఎంత గ్లామర్ గా ఫోటోలు షేర్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. ఈ లుక్స్ వల్ల ఫాలోవర్స్ పెరగడమే కాదు ఈ ఫోటోలు చూసి ఎవరైనా దర్శక నిర్మాతలకు, హీరోలకు నచ్చితే సినిమా ఛాన్స్ లు కూడా లభిస్తాయనే చిన్న ఆశ. అందుకే చాలామంది హీరోయిన్లు,హీరోయిన్లుగా ఇండస్ట్రీకి రావాలనుకునే కొత్త వాళ్లు కూడా సోషల్ మీడియానే ఆయుధంగా ఎంచుకుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ మాత్రం మ్యాగజిన్ కవర్ పేజీకి ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి.


ఈ ఫోటోలలో ఫాతిమా సనా షేక్ అందాలకి కుర్రకారు మతిపోతోంది. తాజాగా ఫాతిమా సనా షేక్ FACE మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇందులో నాలుగు రకాల విలక్షణమైన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అలరించింది. ఫాతిమా నాలుగు విభిన్నమైన డ్రెస్సులు వేసుకోగా .. ఆ ఫోటోల్లో ప్రతి ఒక్క ఫోటో చాలా అద్భుతంగా రావడమే కాకుండా ఈ ఫొటోస్ ప్రస్తుతం ఆమె అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. పైగా ప్రతీ ఫోటో ఒక స్టోరీ చెబుతుంది అంటూ షేర్ చేసిన క్యాప్షన్ కూడా హైలెట్గా నిలిచింది.


ఫాతిమా వేసుకున్న డ్రెస్ ల విషయానికి వస్తే.. టర్కోయిస్- ఎరుపు పైస్లీ ప్రింట్ లెహంగా, మరొకటి గోల్డ్ ఎంబెల్లిష్డ్ లెహంగా, గ్రీన్-గోల్డ్ బనారసి లెహంగా,ఇక నాలుగవది ఆక్వా బ్లు ఫ్లోరల్ సిల్క్ చీర..ఈ నాలుగు డ్రెస్సుల్లో కూడా ఫాతిమా చాలా అందంగా కనిపించడమే కాకుండా తన మత్తు కళ్ళతో చూసేవారికి మత్తెక్కిస్తోంది..


ఫాతిమా సనా షేక్ పర్సనల్ విషయాలు, సినిమాల విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. అంతకుముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ అన్నింటికంటే ఎక్కువ గుర్తింపు దంగల్ ద్వారానే వచ్చింది. ఈ సినిమా వచ్చాక అమీర్ ఖాన్ తో ఫాతిమా డేటింగ్ చేస్తోంది అంటూ వార్తల్లో కూడా నిలిచింది. అంతేకాదు అమీర్ ఖాన్ ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ చేయడం వల్లే తన రెండో భార్యకు విడాకులు ఇచ్చారనే రూమర్లు కూడా వినిపించాయి.


ఇక ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ అమీర్ ఖాన్ రీసెంట్గా తను మూడో పెళ్లి చేసుకోబోయే మహిళని కూడా పరిచయం చేశాడు. ఇక ప్రస్తుతం ఫాతిమా తమన్నా మాజీ ప్రియుడు అయినటువంటి విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరూ ఎక్కువగా బయట కనిపించడంతోపాటు పబ్బులు, రెస్టారెంట్లు అంటూ తిరగడంతో వీరి మధ్య ఉన్న బంధం గురించి బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ బంధం పై కూడా వీరు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇటీవల ఆర్ మాధవన్ తో కలిసి ఆప్ జైసా కోయి అనే సినిమాలో నటించింది.