Begin typing your search above and press return to search.

గ్లామర్ తో కట్టిపడేస్తున్న దిశాపటాని.. ఫోటోలు వైరల్!

దిశా పటానీ.. నటనతోనే కాదు గ్లామర్ తో కూడా కట్టిపడేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. పూరీ జగన్నాథ్ హీరోగా మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది.

By:  Madhu Reddy   |   20 Sept 2025 3:48 PM IST
గ్లామర్ తో కట్టిపడేస్తున్న దిశాపటాని.. ఫోటోలు వైరల్!
X

దిశా పటానీ.. నటనతోనే కాదు గ్లామర్ తో కూడా కట్టిపడేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. పూరీ జగన్నాథ్ హీరోగా మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. మొదటి సినిమాతోనే తన అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇందులో తన నటనతో అబ్బురపరిచిన ఈమె.. ఆ తర్వాత హిందీలో పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకొని అక్కడ సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో 'స్త్రీ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్స్ తో అటు బాలీవుడ్ పరిశ్రమ కూడా ఊపిరి పీల్చుకుంది అనడంలో సందేహం లేదు.


లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చి సంచలనం సృష్టించి.. తన ఖాతాలో ఒక బ్లాక్ బాస్టర్ విజయాన్ని వేసుకున్న దిశాపటానీ ఇప్పుడు 'స్త్రీ 3' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అలా ఒకవైపు తన సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు ఇలా అభిమానులను ఆకట్టుకుంటూ మరింత వైరల్ గా మారింది అని చెప్పవచ్చు. తాజాగా అభిమానులను ఆకట్టుకోవడానికి వైట్ కలర్ ఫ్రాక్ ధరించి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా ఎద అందాలను చూపిస్తూ.. కొంటె చూపులతో కుర్రకారును మాయ చేస్తోంది. అంతేకాదు ఈ ఫోటోలకు ఆమె ఇచ్చిన ఫోజులు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అనడంలో సందేహం లేదు. అంతలా తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది దిశా పటానీ.


దిశాపటానీ ఫోటోలు చూసిన అభిమానులు, ఫాలోవర్స్, నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది నెట్ ఫాలోవర్స్ లవ్ ఎమోజీలను షేర్ చేస్తే.. మరి కొంత మంది ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఇంకొంతమంది రేడియంట్ గ్లాస్ స్కిన్ అంటూ ఆమె మేని ఛాయను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఎవరికి వారు దిశా పటాని గ్లామర్ పై కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.


1992 జూన్ 13న ఉత్తరప్రదేశ్లోని బరేలిలో జన్మించింది. ఈమె తండ్రి జగదీష్ సింగ్.. ఈయన ఒక పోలీసు అధికారి. ఈమె తల్లి హెల్త్ ఇన్స్పెక్టర్.. అక్క కుష్బూ పటానీ. భారత సైన్యంలో మేజర్ గా పని చేస్తున్నారు. అలాగే ఫిట్నెస్ కోచింగ్, ఎంటర్ప్రైన్యూర్ కూడా. అంతేకాదు ఈమెకు సూర్యాన్ష్ పటానీ అనే తమ్ముడు కూడా ఉన్నారు. లక్నోలోని అమిటి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పూర్తి చేసింది. అంతేకాదు పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ 2013లో మొదటి రన్నరప్ గా కూడా నిలిచింది.


ఈమె ప్రత్యేకతల విషయానికి వస్తే.. గూగుల్ లో 2016లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితాలో ఈమె ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించుకున్న ఈమె ఏడాదికి 58 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్న నటిగా 43వ స్థానంలో నిలిచింది. అంతేకాదు టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో కూడా తరచూ చోటు సంపాదించుకుంటుంది.