బీటౌన్ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. అసలేం జరిగింది?
సినిమాలో అవకాశం ఇస్తానని ఫోన్ చేసిన దర్శకుడు.. తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని అడిగినట్లు ఆరోపించారు. దీంతో ఆమె షాక్ కు గురయ్యారు.
By: M Prashanth | 13 Oct 2026 11:18 AM ISTసినిమాల్లో అవకాశాలు రావాలంటే కొందరు చెప్పినట్లు వినాల్సిందేనా.. తమకు ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్లు బయటపెట్టిన ప్రతిసారీ ఆ ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రీసెంట్ గా ఓ బాలీవుడ్ నటి చేసిన కామెంట్స్ కూడా ఇదే అంశంపై డిబేట్ ను స్టార్ట్ చేశాయి. సౌత్ సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ దర్శకుడి నుంచి తనకు ఇబ్బందికరమైన అనుభవం ఎదురైందని ఆమె చెప్పారు.
సినిమాలో అవకాశం ఇస్తానని ఫోన్ చేసిన దర్శకుడు.. తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని అడిగినట్లు ఆరోపించారు. దీంతో ఆమె షాక్ కు గురయ్యారు. తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయం ఉన్న ఆ బ్యూటీ సినిమాలతో పాటు టీవీ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి రీసెంట్ గా ఆమె మాట్లాడారు. ఓ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు మరో సినిమా కోసం తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు.
మొదట సినిమా అవకాశం గురించి మాట్లాడతారని భావించినా.. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ తనను ఆశ్చర్యానికి గురిచేశాయని తెలిపారు. మరో సినిమాలో అవకాశం కావాలంటే తనతో రిలేషన్ పెట్టుకోవాలని దర్శకుడు అడిగినట్లు ఆమె ఆరోపించారు. అప్పటికే ఆయనతో కలిసి పనిచేయడంతో ఇలాంటి మాటలు వింటానని అసలు ఊహించలేదని చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక షాక్ కు గురైనట్లు గుర్తు చేసుకున్నారు.
ఆ దర్శకుడు వేరే వాళ్ళతో ఇలాగే ప్రవర్తించడం చూశానని ఆమె చెప్పిన ఆమె.. అయితే తనకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవుతుందని అనుకోలేదన్నారు. ఆ ఫోన్ కాల్ తర్వాత ఆయనతో మాట్లాడటం కంటిన్యూ చేయకూడదని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆయన నంబర్ ను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ఆ ఇన్సిడెంట్ తనపై ఫుల్ ఎఫెక్ట్ చూపించిందని ఆమె చెప్పారు.
ఆ తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదని అనుకున్నట్లు వెల్లడించారు. మరో సినిమా చేయాలన్నా ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎదురవుతుందేమోననే భయం తనను వెంటాడినట్లు ఆమె కామెంట్స్ బట్టి తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన బాధపెట్టిందని ఆమె వివరించారు. అయితే తనకు ఆ అనుభవం ఎదురైన సమయంలో ఏ సినిమా జరుగుతోంది, ఆ తర్వాత ఏ సినిమా కోసం ఫోన్ వచ్చిందనే వివరాలు ఆమె వెల్లడించలేదు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడి పేరు కూడా చెప్పలేదు. దీంతో ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయంటూ గతంలోనూ పలువురు హీరోయిన్లు మాట్లాడారు. ఇప్పుడు ఆ నటి చేసిన కామెంట్స్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చాయి. అయితే ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
