పిక్ టాక్: హొయలు పోతున్న ముద్దుగుమ్మ
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో 2019లో బాలీవుడ్ కి పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే.
By: Ramesh Palla | 29 Nov 2025 5:00 PM ISTస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో 2019లో బాలీవుడ్ కి పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది, కానీ ఆ వెంటనే కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ స్తంభించి... ఆమెకు మరిన్ని ఆఫర్లు రాలేదు. 2022లో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ ఆ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని చాలా ఆశ పడింది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా ప్రారంభమైనప్పటి నుండి తెలుగులోనూ ఆమె గురించి ప్రచారం జరిగింది, కానీ సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి పాత్రను ఎలా అనన్య పాండే ఒప్పుకుంది అంటూ చాలా మంది విమర్శించారు.
బాలీవుడ్ లోనూ ఈమెకి ఆ సినిమా కారణంగా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సౌత్ నుండి మరిన్ని అవకాశాలు వచ్చినా కూడా అనన్య పాండే సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. మెల్లమెల్లగా బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే కేసరి చాప్టర్ 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ ఈమెకి నటిగా పరవాలేదు అన్నట్లు గుర్తింపును తెచ్చి పెట్టింది. వెండి ఏతెరపై మాత్రమే కాకుండా బుల్లి తెరపై కూడా ఈమె తన సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా ఎప్పటికప్పుడు జనాలు కనిపిస్తూ వస్తోంది.
బాలీవుడ్ లో ఈ అమ్మడు భవిష్యత్తులో మంచి స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతోంది అంటూ చాలా మంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సోషల్ మీడియా ప్లాట్ఫారం ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఈమె షేర్ చేసే ఫోటోలు కారణంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు వరుసగా అందాల ఆరబోత ఫోటో షూట్లని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈమె స్కిన్ షో చేసిన ప్రతి ఫోటో షూట్ సూపర్ హిట్ అన్నట్లుగా నిలుస్తాయి. ఈ ఫోటో షూట్ లో కూడా హొయలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. దాంతో ఈ అమ్మడి అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
అందంగా ఎవరైనా ఉంటారు, కానీ ఫోటోలకి తగ్గట్లుగా అందంగా కనిపించడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది, అనన్య పాండే ఆ విషయంలో ఎప్పటికప్పుడు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందాల ఆరబోత ఫోటోలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ అలరిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఈమెకి ఉన్న పరిచయాలు అలాగే బ్యాక్ గ్రౌండ్ కారణంగా వరుస సినిమా ఆఫర్లు దక్కుతున్నాయి. పైగా అందంతో పాటు అభినయంతో కూడా మెప్పిస్తున్న కారణంగా భవిష్యత్తులో ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో లైగర్ సినిమాతో నిరుత్సాహపరిచినప్పటికీ ఈమెకి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు, అందుకే తెలుగులో ముందు ముందు మరిన్ని సినిమాలు ఏమి చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ అమ్మడు తెలుగులో నటిస్తుందా అనేది చూడాలి.
