పిక్‌టాక్ : చూపు తిప్పనివ్వని అందాల స్టార్ కిడ్
బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్‌లో ఎక్కువ శాతం స్టార్ కిడ్స్ అనడంలో సందేహం లేదు
By: Ramesh Palla | 16 Sept 2025 3:59 PM ISTబాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్‌లో ఎక్కువ శాతం స్టార్ కిడ్స్ అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీకి ప్రతి ఏడాది ఎంతో మంది స్టార్ కిడ్స్ పరిచయం అవుతూ ఉంటారు. అయితే స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన వారు ఇండస్ట్రీలో కొనసాగడం సాధ్యం కాదు. వారిలో ప్రతిభ, అందం, ఇంకా అణుకువ ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటారు. ప్రతి ఏడాది ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ లో దాదాపుగా సగం మంది ఇండస్ట్రీ బయటకు వెళ్లి పోతారు. అలా నెపో కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండేను మొదట అంతా చాలా తక్కువ సమయంకే కనిపించకుండా పోతుందని అంతా భావించారు. కానీ తన ప్రతిభ చూపిస్తూ, అందాల ఆరబోత చేస్తూ, సోషల్ మీడియా ద్వారా, వెండి తెరపై తనదైన సత్తా చాటాడం ద్వారా బాలీవుడ్‌లో మెల్ల మెల్లగా స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకునేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
కేసరి 2 తో వచ్చిన అనన్య పాండే
ఆకట్టుకునే అందం ఉన్నప్పటికీ ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస సినిమాలు చేయాలి అనుకున్న సమయంలోనే కరోనా వల్ల ఈమె ప్లాన్స్ రివర్స్ అయ్యాయి. అంతే కాకుండా ఇష్టం లేకుండా చేసిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చింది. దాంతో కాస్త జాగ్రత్త పడ్డ ఈ అమ్మడు బాలీవుడ్‌లోనే సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఈ ఏడాది ఇప్పటికే కేసరి 2 సినిమాతో వచ్చిన అనన్య పాండే వచ్చే ఏడాది మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ అమ్మడికి హిట్ లేకున్నా వరుస ఆఫర్లు రావడంకు కారణం ఈమె అందం అనడంలో సందేహం లేదు. రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం అందరికీ తెలిసిందే.
ఇన్‌స్టాగ్రామ్‌లో 26.5 మిలియన్‌ల ఫాలోవర్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 26.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎలాంటి డ్రెస్ వేసినా అనన్య పాండే చూపు తిప్పనివ్వదు. అలాంటి అనన్య పాండే ఈసారి థైస్ ను చూపిస్తూ కవ్వించే విధంగా ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆగి మరీ ఈ అమ్మడి ఫోటోలు చూసే వారు చాలా మంది ఉన్నారు. సింపుల్ హెయిర్ స్టైల్ తో, డీసెంట్ మేకోవర్‌తో అనన్య పాండే ఈ ఔట్ ఫిట్ లో భలే ఉంది అంటూ అభిమానులతో పాటు, సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారు, అంతే కాకుండా నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న లేడీకి కమర్షియల్ బ్రేక్ తప్పనిసరిగా రావాలంటూ కోరుకుంటున్నాం అంటున్న వారు చాలా మంది ఉన్నారు.
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అయిన అనన్య పాండే 2019లో స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అదే ఏడాదిలో పతి పత్నీ ఔర్ వో సినిమాలోనూ అనన్య నటించి మెప్పించింది. ఆ తర్వాత కరోనా కారణంగా సినిమాలు ఎక్కువ రాలేదు. 2022లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన లైగర్ సినిమా విడుదల అయ్యింది. అతకు ముందు ఏడాదిలోనే లైగర్ విడుదల కావాల్సి ఉన్నా కరోనా వల్ల చాలా ఆలస్యం అయింది. లైగర్ ఫ్లాప్ అయినా బాలీవుడ్‌లో ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేస్తూ వస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉండటం, నటనలో ప్రతిభ, డాన్స్ ప్రతిభ, ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కారణంగా లైగర్ బ్యూటీ అనన్య పాండే ఖచ్చితంగా భవిష్యత్తులో స్టార్ హీరోయిన్‌గా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటి ఫలితాలు ఏంటి అనేది చూడాలి.
