పిక్‌టాక్ : పొట్టి నిక్కర్‌లో అందాల ఐషా
'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ.
By: Ramesh Palla | 1 Sept 2025 10:16 AM IST'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు పెద్దగా ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. అయితే ఇతర భాషల్లో ఆఫర్లు దక్కించుకోవడం తో ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. నేహా శర్మ చెల్లి ఐషా శర్మ ఇప్పుడు బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. సినిమాలతో పెద్దగా సందడి చేయలేదు కానీ సోషల్ మీడియాలో ఐషా శర్మ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఐషా శర్మ యొక్క అందాల ఆరబోత ఫోటోలు ఎప్పుడూ నెట్టింట వైరల్ కావడంతో పాటు, ఇంత అందంగా ఉన్న ఐషా శర్మ ఎందుకు సోషల్ మీడియాకు పరిమితం అవుతుంది, సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అందాల ఆరబోతతో ఐషా శర్మ
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఐషా శర్మ ఒక సినిమాలో నటించింది. 2018లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పేయీ లు కలిసి నటించిన ఈ హిందీ యాక్షన్ థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా కూడా ఈమెకు వెంట వెంటనే ఆఫర్లు వచ్చాయి. కానీ ఈమె మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఇంతటి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసే ఐషా శర్మ ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటుంది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ముందు ముందు అయినా ఐషా శర్మ అందాల ఆరబోత పాత్రలను చేస్తూ వెండి తెరపై మెరుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మతి పోగొట్టే అందాల ఆరబోత ఫోటోలు
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మరోసారి సంచలన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి పొట్టి నిక్కర్ తో పాటు టాప్ సైతం సింపుల్‌గా ఉండే విధంగా ఔట్ ఫిట్ ను ధరించింది. ఈ లుక్ లో ఐషా ను చూస్తూ ఉంటే గుండె జారీ గల్లంతు అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న ఐషా శర్మ మతి పోగొడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తున్న ఐషా శర్మ ఇవే అందాలను వెండి తెరపై చూపిస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ షేక్ కావడం ఖాయం అని, కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం అనే అభిప్రాయంను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ ఫోటోలను లైక్ చేయడంతో పాటు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లో ఐషా శర్మ ఫాలోవర్స్ సంఖ్య
ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 6.4 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఐషా శర్మ ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మరింత మంది ఫాలోవర్స్‌ను దక్కించుకుంటోంది. ఒక్క సినిమాలో నటించి, అది కూడా పెద్దగా ఆడలేదు. అయినా కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ ను దక్కించుకోవడం ఖచ్చితంగా చాలా పెద్ద విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాల్లో ఎంట్రీకి ఇది మంచి సమయం అని, త్వరలోనే ఐషా శర్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని, మరిన్ని సినిమాలు చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం చాలా మంది ఆశిస్తున్నారు. మరి అందుకు ఆమె నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనేది చూడాలి. అందాల ఐషా శర్మ కు సౌత్ ఇండియాలోనూ ముఖ్యంగా తెలుగు నెటిజన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.
