క్యాన్సర్ తో పోరాడుతూ.. మహాభారతం సీరియల్ నటుడు కన్నుమూత
విషయంలోకి వెళ్తే.. వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన నిన్న శ్వాస విడిచినట్లు సమాచారం.
By: Madhu Reddy | 15 Oct 2025 2:50 PM ISTసినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను, సినీ పరిశ్రమను అగాధంలోకి నెట్టివేస్తున్నాయి.ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు తుది శ్వాస విడుస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఒక హాలీవుడ్ సింగర్ డీ'ఎంజిలో క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస విడవగా.. కొన్ని గంటల క్రితం ప్రముఖ టాలీవుడ్ సీనియర్ సింగర్ రావు బాల సరస్వతి దేవి కన్నుమూశారు.. అయితే ఇంతలోనే మరో మరణ వార్త అందరిని కలచి వేస్తోంది.
విషయంలోకి వెళ్తే.. వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన నిన్న శ్వాస విడిచినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు.
1988 -1994 మధ్య బిఆర్ చోప్రా తెరకెక్కించిన 'మహాభారత్' టీవీ సీరియల్ లో కర్ణుడి పాత్రలో పంకజ్ భారీ గుర్తింపు సొంతం చేసుకున్నారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. పంకజ్ ధీర్ మరణంతో బాలీవుడ్, టీవీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది .పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు ఈయన మరణానికి సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
పంకజ్ కర్ణుడి పాత్రతోనే కాదు చంద్రకాంత, ది గ్రేట్ మరాఠా, యుగ్, బధో బహు వంటి ఇతర పాత్రలకి కూడా ప్రసిద్ధి చెందారు. అలాగే సడక్, సోల్జర్ , బాద్ షా వంటి ఎన్నో హిందీ చిత్రాలలో చిన్న పాత్రలు పోషించి నటన జీవితాన్ని కొనసాగించారు. 2006లో తన సోదరుడు సత్లుజ్ ధీర్ తో కలిసి ముంబైలోని జోగేశ్వరిలో విషెస్ స్టూడియోస్ అనే షూటింగ్ స్టూడియోని స్థాపించారు. 2019లో ముంబైలో యాక్టింగ్ అకాడమీను ప్రారంభించిన ఈయన.. దీనికి నటుడు గోపి పెయింటల్ ఫ్యాకల్టీ హెడ్గా కొనసాగారు.
నటుడిగా అటు టీవీ సీరియల్స్ తో పాటు ఇటు చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన. దర్శకుడిగా కూడా వ్యవహరించారు. 1970లో పర్వానా, 2014లో నా తండ్రి గాడ్ ఫాదర్ వంటి చిత్రాలకి దర్శకత్వం వహించారు
