Begin typing your search above and press return to search.

ఆ న‌టుడు మ‌ర‌ణానికి 4 గంట‌ల ముందు..!

ప్రముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు గోవర్ధన్ అస్రానీ 84 సంవత్సరాల వయసులో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   21 Oct 2025 9:48 AM IST
ఆ న‌టుడు మ‌ర‌ణానికి 4 గంట‌ల ముందు..!
X

ప్రముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు గోవర్ధన్ అస్రానీ 84 సంవత్సరాల వయసులో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం బాలీవుడ్ దిగ్గ‌జాలు తీవ్ర విచారం వ్య‌క్తం చేసారు. ప‌రిశ్ర‌మ ఒక గొప్ప హాస్య న‌టుడిని కోల్పోయింద‌ని ఆందోళ‌న చెందారు. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు, న‌ట‌గురువు అనుపమ్ ఖేర్ అస్రానీ మ‌ర‌ణంపై తన విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని మ‌రింత‌ మెరుగైన ప్రదేశంగా మార్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గత వారం ఆయ‌న‌తో మాట్లాడిన‌ప్పుడు ఖేర్ నటనా పాఠశాలలో మాస్టర్ క్లాస్ తీసుకునేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారని కూడా అనుప‌మ్ ఖేర్ వెల్లడించారు.

అస్రానీ మరణానికి అనుప‌మ్ ఖేర్ సంతాపం తెలియ‌జేసారు. ప్రజలను నవ్వించే మీ సామర్థ్యం మిమ్మల్ని ఎప్ప‌టికీ సజీవంగా ఉంచుతాయ అనుప‌మ్ అన్నారు. అస్రానీని గుర్తుచేసుకుంటూ ఒక‌ వీడియోను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.

అస్రానీ గురించి చాలా మందికి గొప్ప హాస్య నటుడిగా తెలుసు.. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అతడు FTIIలో ఉపాధ్యాయుడు కూడా. అత‌డు ప‌లువురు లెజెండరీ కళాకారులను తీర్చిదిద్దారు. అనుపమ్ ఖేర్ గతంలో తనతో కలిసి హిందీ- తెలుగు సినిమాలు చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారితో సాన్నిహిత్యానికి సంబంధించిన జ్ఞాప‌కాలు ఫ్లాష్‌బ్యాక్ లాగా వెనక్కి వస్తాయని అన్నారు.

అస్రానీ మ‌ర‌ణానికి ముందు హ్యాపి దీపావ‌ళి అని విషెస్ తెలియ‌జేసిన చివ‌రి సోష‌ల్ మీడియా వ్యాఖ్య‌ కూడా ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. దీపావ‌ళి రోజున మ‌ధ్యాహ్నం 3గం.ల‌కు ఆయ‌న మృతి చెందార‌ని వార్త‌లు రాగా, అప్ప‌టికి గంట ముందు సోష‌ల్ మీడియా ఖాతాలో `హ్యాపి దివాళి` అని అస్రానీ పోస్ట్ చేసారు.

అస్రానీ మరణ వార్త విన్న తర్వాత, అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి అర్పించారు. అస్రానీ నుంచి చాలా నేర్చుకున్నాన‌ని, ఉద్వేగంతో తాను దుఃఖాన్ని ఆపుకోలేక‌పోతున్నాన‌ని కూడా అక్ష‌య్ అన్నారు.

హెరా ఫేరీ, దే దానా డాన్ వంటి కల్ట్ కామెడీలలో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్రేక్షకులు క‌డుపుబ్బా న‌వ్వుకున్నారు. షోలే వంటి క్లాసిక్‌లోను అత‌డి అద్భుత న‌ట ప్రదర్శనకు గొప్ప‌ పేరొచ్చింది. అస్రానీ కామెడీ టైమింగ్ ని ఎప్ప‌టికీ అభిమానులు మ‌ర్చిపోలేరు.