టాప్ స్టోరి: రొమాన్స్‌లో కొత్త జంటల దుందుడుకు!
సినిమా ప్రేక్షకులకు ఎల్లప్పుడూ సరికొత్త అనుభూతిని ఇచ్చే అంశాలలో వెండితెరపై కొత్త జంటల కలయిక ఒకటి.
By: Sivaji Kontham | 26 Jun 2026 3:00 PM ISTసినిమా ప్రేక్షకులకు ఎల్లప్పుడూ సరికొత్త అనుభూతిని ఇచ్చే అంశాలలో వెండితెరపై కొత్త జంటల కలయిక ఒకటి. ఇప్పటికే స్టార్‌డమ్ ఉన్న నటులతో కొత్త తారల కలయిక కూడా ఆసక్తిని కలిగిస్తుంది. నిజానికి మునుపెన్నడూ చూడని సరికొత్త కాంబినేషన్లు స్క్రీన్‌పైకి వచ్చినప్పుడు వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, సరికొత్త ఉత్సాహం ప్రేక్షకులలో మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. బాలీవుడ్ మునుపెన్నడూ లేని విధంగా 2026లో సరికొత్త లవ్ స్టోరీలు, హారర్, యాక్షన్, ఫాంటసీ చిత్రాలతో సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పలువురు యంగ్ నటీనటులు సరికొత్త జోడీలుగా ఇండస్ట్రీని షేక్ చేయడానికి దూసుకొస్తున్నారు. ఆసక్తికరంగా టాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ శ్రీలీల, జయకృష్ణ ఘట్టమనేని కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ప్రస్తుత తరం ప్రేక్షకులు పాత ఫార్ములా కాస్టింగ్‌ల కంటే.. స్క్రీన్‌పై కనిపించే జంటల మధ్య ఉండే సహజమైన కెమిస్ట్రీ, అద్భుతమైన నటన - సరికొత్త కథనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మార్పును అందిపుచ్చుకుంటూ మైథాలజీ, రొమాన్స్, డ్రామా, హారర్ వంటి విభిన్న జోనర్లలో కొత్త జంటలు సరికొత్త ఒరవడిని సృష్టించబోతున్నాయి. 2026 బాలీవుడ్ చలనచిత్ర రంగును మార్చబోతున్న ఆరు క్రేజీ యంగ్ కపుల్స్ కథేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటిగా `ముంజ్యా` సినిమాతో భారీ విజయం సాధించిన అభయ్ వర్మ, యువ నటి రాషా తడాని కలిసి `లయ్కా లయ్కి` అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. వీరిద్దరి ఎనర్జీ, చరిష్మా ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. రాషా తడానీ మరోవైపు టాలీవుడ్ డెబ్యూ నటుడు జయకృష్ణ సరసన నటిస్తూ ఇటు తెలుగు చిత్రసీమలోను గుబులు పెంచుతున్న సంగతి తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. రవీనా టాండన్ కుమార్తెగా రాషా తడానీకి టాలీవుడ్ లో క్రేజ్ ఉంది. ఇక్కడ పెద్ద కెరీర్ జర్నీని ఆశిస్తోంది. మొదటి సినిమా విజయం దీనిని డిసైడ్ చేయొచ్చు.
మరోవైపు సల్మాన్ సరసన డెబ్యూ ఇచ్చి, వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న సాయి మంజ్రేకర్ `కిల్` సినిమాతో ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ను కనబరిచిన రాఘవ్ జుయల్‌తో కలిసి `ఇకాయ్` అనే చిత్రంలో భిన్నమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించనున్నారు. ఇక టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన శ్రీలీల బాలీవుడ్ కొత్త తరం నటుడు ఇబ్రహీం అలీ ఖాన్ జోడీగా నటిస్తున్న `దిలేర్` చిత్రం 2026లో ఒక మోడ్రన్ రొమాంటిక్ జానర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
అలాగే `సయ్యారా` సక్సెస్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న అనీత్ పద్దా టాలెంటెడ్ నటుడు విశాల్ జెత్వాతో కలిసి `శక్తి శాలిని` చిత్రంలో నటిస్తోంది. విశాల్ ఎమోషనల్ రేంజ్, అనీత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన అస్సెట్స్ కానున్నాయి. ఇక ది ఆర్చీస్, మేడ్ ఇన్ హెవెన్ చిత్రాలతో అలరించిన మిహిర్ అహూజా...`చిరయ్య` నటి ప్రసన్న బిష్త్ కలిసి ఆదిత్య చండియోకే దర్శకత్వంలో ఒక అన్‌టైటిల్డ్ డ్రామెడీ చిత్రంలో నటిస్తున్నారు. చిన్న పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో వీరి మధ్య ఉండే అమాయకత్వం, కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇవ్వడం ఖాయం.
ది ఆర్చీస్, జిగ్రా చిత్రాలతో నేటి తరం ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వేదాంగ్ రైనా, తన తదుపరి మ్యాడోక్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్‌లో ప్రగతి శ్రీవాస్తవతో జోడీ కడుతున్నాడు. వేదాంగ్ నటించిన మై వాపస్ ఆవుంగా చిత్రం సైలెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి క్రేజ్ అమాంతం పెరిగింది. జనాదేశ్, `నఖ్రేవాలీ` వంటి చిత్రాలతో బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా రంగంలోకి దూసుకొస్తున్న ప్రగతి, వేదాంగ్ కాంబినేషన్ 2026లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ విధంగా రొమాన్స్ - యూత్‌ఫుల్ ఎనర్జీతో దూసుకొస్తున్న ఈ ఆరు కొత్త జంటలు 2026లో వెండితెరపై సరికొత్త మ్యాజిక్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి.
