2026 బాలీవుడ్‌కు పండగేనా?
2025 భారీ హిట్‌లని అందించి బాలీవుడ్‌కు మంచి ఊపుని అందించడంతో ఇప్పుడు అందరి దృష్టి న్యూ ఇయర్ 2026పై పడింది.
By: Tupaki Entertainment Desk | 27 Dec 2025 3:00 PM ISTగతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి నూతన జవసత్వాలని అందించిన ఇయర్ 2025. ఈ ఏడాది విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీకి నూతనోత్తేజాన్ని అందించాయి. మరిన్ని భారీ సినిమాలకు ధైర్యాన్నిచ్చాయి. సైయారా, విక్కీ కౌశల్ ఛావా, రష్మిక మందన్న థామా, ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ నటించిన సెన్సేషనల్ మూవీ `ధురంధర్` ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఇక ఛావా, `ధురంధర్` గురించి ప్రతద్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్‌లో విడుదలైన `ధురంధర్` సైలెంట్‌గా విడుదలై వరుసగా రికార్డుల్ని తుడిచి పెట్టేస్తోంది. బాహుబలి, పుష్ప 2 రికార్డుల్ని తిరగరాసి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025 భారీ హిట్‌లని అందించి బాలీవుడ్‌కు మంచి ఊపుని అందించడంతో ఇప్పుడు అందరి దృష్టి న్యూ ఇయర్ 2026పై పడింది.
కారణం 2026లో భారీ పాన్ ఇండియా సినిమాలు, వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు, హాలీవుడ్ మేకర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న `రామాయణ` పార్ట్ 1, `ధురంధర్` పార్ట్ 2తో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటిస్తున్న `కింగ్`, యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న అలియాభట్ `ఆల్ఫా`, సన్నిడియోల్ `బోర్డర్ 2`, లవ్ అండ్ వార్, బ్రహ్మాస్త్ర పార్ట్ 2, మర్దానీ 3, దృశ్యం 3, బాలీవుడ్ స్టార్స్ సంజయ్‌దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన `ది రాజా సాబ్` రిలీజ్ అవుతున్నాయి.
ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీస్ `రామాయణ` పార్ట్ 1 ఇంత వరకు రామాయణ గాధ నేపథ్యంలో ఎన్నో వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీతో పాటు భారతీయ భాషలన్నింటిలోనూ వచ్చాయి. మళ్లీ అదే కథని రెండు భాగాలుగా `రామాయణ` పేరుతో నితీష్ తివారి తెరపైకి తీసుకొస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కేజీఎఫ్ స్టార్ యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన రామాయణ గాథలకు మించి ఇందులో ఏదో కొత్తగా చూపించబోతున్నారని ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాని భారీ స్థాయిలో 3డీలోనూ రిలీజ్ చేస్తుండటంతో వరల్డ్ సినీ దిగ్గజాల దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఇక లవ్ అండ్ వార్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పెళ్లి తరువాత అలియాతో కలిసి రణ్‌బీర్ నటిస్తున్న మూవీ ఇది. ఇందులో విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నాడు. అంతేనా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఇదే తరహాలో అలియాభట్ `ఆల్ఫా`, బ్రహ్మాస్త్ర పార్ట్ 2లపై క్రేజ్ ఏర్పడింది. రాణీముఖర్జీ మర్దానీ 3, సన్నిడియోల్ బోర్డర్ 3తో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న `ది రాజా సాబ్`లో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించడం, ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మలయాళ `దృశ్యం 3` డైరెక్టర్‌ని, ఆ స్టోరీ రైట్స్‌ని, స్టోరీని లెక్కలోకి తసుకోకుండా సొంతంగా అజయ్‌దేవ్‌గన్ చేస్తున్న మూవీ `దృశ్యం 3`. ఒరిజినల్‌ని కాదని అజయ్ ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక షారుక్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న `కింగ్` కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బిగ్ స్టార్స్, లార్జర్‌దెన్ లైఫ్ సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే సినిమాలతో 2026 బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం.
