Begin typing your search above and press return to search.

బాలీవుడ్.. ఇక మార్పులు చేసుకోవాల్సిందేనా?

2025 ముగిసి.. 2026 మొదలై అప్పుడే 20 రోజులు అయిపోయాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో గత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల కోసం జోరుగా ప్రచారం సాగుతోంది.

By:  M Prashanth   |   21 Jan 2026 4:00 AM IST
బాలీవుడ్.. ఇక మార్పులు చేసుకోవాల్సిందేనా?
X

2025 ముగిసి.. 2026 మొదలై అప్పుడే 20 రోజులు అయిపోయాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో గత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. అనుకున్న రేంజ్ లో బీటౌన్ వసూళ్లు రాబట్టలేదని టాక్ వినిపిస్తోంది. నిజానికి 2025లో హిందీ చిత్రాలు.. సుమారు రూ.4 వేల కోట్లు రాబట్టాయని అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. అందులోనే డబ్బింగ్ చిత్రాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి.

అయితే గత ఏడాది సినిమాలు వసూలు చేసిన ఎమౌంట్.. నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ఎక్కువే. కానీ ఇప్పుడు థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ సంఖ్య చాలా తగ్గింది. అందుకే తక్కువేనని అంతా అంటున్నారు. ఒకప్పుడు పెద్ద సంఖ్యలో సినీ ప్రియులు థియేటర్స్ కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. వసూళ్లు భారీగా నమోదవుతున్నా.. ఫుట్ ఫాల్స్ మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. కానీ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడంతో కలెక్షన్స్ నెంబర్స్ పెద్దగా అనిపిస్తున్నాయి.

అదే సమయంలో ఆ నెంబర్స్ ను కూడా అంతా నమ్మడం లేదు. ఎందుకంటే చాలా సినిమాల మేకర్స్ బల్క్ బుకింగ్ పద్ధతిని యూజ్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో ఖాళీ సీట్లను నింపినట్టు చూపిస్తూ వసూళ్లను పెంచేందుకు ట్రై చేస్తున్నట్లు అంతా చెబుతున్నారు. ఒకప్పుడు పెద్ద సినిమాలకు లేదా నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న సినిమాల వరకు కూడా ఆ పద్ధతి విస్తరించింది.

దీని వల్ల బాక్సాఫీస్ గణాంకాలపై నమ్మకం తగ్గిపోతోందని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే కొంతకాలం అలా జరిగితే పూర్తిగా ఎవరు పట్టించుకోరేమో. అయితే ముఖ్యంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా పడిపోవడానికి ప్రధాన కారణంగా అధిక టికెట్ ధరలనే నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆ సమస్య కరోనా తర్వాత మాత్రమే మొదలైంది కాదు. అంతకుముందే చాలా సినిమాలకు రేట్ల వల్లే జనాలు వెళ్లలేదు

అదే సమయంలో బాక్సాఫీస్ లెక్కలను ప్రజలు నమ్మినా.. గత ఏడాది ధురంధర్, ఛావా, సయ్యారా వంటి మూడు నాలుగు పెద్ద సినిమాలే మొత్తం ఆదాయంలో దాదాపు 40 శాతం వసూలు చేశాయి. మిగిలిన సినిమాలు ఆసు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఒక పరిశ్రమ కొద్ది బ్లాక్‌ బస్టర్ల మీద మాత్రమే ఆధారపడి నిలబడలేదన్నది ట్రేడ్ వర్గాల హెచ్చరిక. ముఖ్యంగా రూ.100 నుంచి రూ.200 కోట్ల మధ్య వసూలు చేసే మీడియం రేంజ్ హిట్లు లేకపోవడం గమనార్హం.

అందుకే చిన్న రేంజ్ నుంచి బడా సినిమాల వరకు అన్ని చిత్రాలూ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి. మేకర్స్ రేట్లు కాస్త తగ్గించి థియేటర్స్ కు ఫుల్ గా రప్పించాలి. అప్పుడు వసూళ్లు ఇంకా పెరుగుతాయి. ఫుట్ ఫాల్స్ కూడా పెరుగుతాయి. అందుకే పలు విషయాల్లో మార్పులు చేసుకుంటే, ప్రేక్షకులను తిరిగి థియేటర్ల వైపు తిప్పుకునే అవకాశం ఇంకా ఉందనే చెప్పాలి. మరి చూడాలి బాలీవుడ్ లో ఎలాంటి మార్పులు వస్తాయో.. వసూళ్లు ఎంత వరకు పెరుగుతాయో..