Begin typing your search above and press return to search.

స్టార్ కి ఫ్యాన్స్ హెచ్చరిక.. గుర్తించాల్సిందే..!

స్టార్ హీరోలు వారి ఫ్యాన్స్ ఇచ్చే జోష్ తోనే రకరకాల సినిమాలు చేస్తారు. ముఖ్యంగా స్టార్స్ తమ అభిమానులను ఆకట్టుకునేందుకే డిఫరెంట్ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తుంటారు.

By:  Ramesh Boddu   |   10 Jan 2026 8:00 PM IST
స్టార్ కి ఫ్యాన్స్ హెచ్చరిక.. గుర్తించాల్సిందే..!
X

స్టార్ హీరోలు వారి ఫ్యాన్స్ ఇచ్చే జోష్ తోనే రకరకాల సినిమాలు చేస్తారు. ముఖ్యంగా స్టార్స్ తమ అభిమానులను ఆకట్టుకునేందుకే డిఫరెంట్ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తుంటారు. ఐతే ఈ టైంలో వాళ్లు ఆ స్టార్ రియల్ అడ్వెంచర్స్ ఇంకా ఫైట్స్ ని ఆశిస్తారు. అనాదిగా హీరోలకు బాడీ డబుల్ అదే డూప్ అన్నది కొనసాగుతూ వస్తుంది. రిస్కీ షాట్స్ కొన్నిటిని డూప్ పెట్టి లాగిచ్చేస్తారు. అదేంటి డూప్ లకైనా అది రిస్కే కదా అనుకోవచ్చు. రిస్కే కానీ వాళ్లు ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంటారు. అందుకే ఆ రిస్క్ లను కూడా ఈజీగా చేస్తుంటారు.

సీన్ చూస్తే అందులో ఉంది ఎవరన్నది..

ఐతే టెక్నాలజీ పెద్దగా తెలియని రోజుల్లో ఏ సీన్ తమ హీరో చేశాడు. ఏ సీన్ లో చూడలేదు అన్నది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సాంకేతికంగా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. కాబట్టి ఒక సీన్ చూస్తే అందులో ఉంది ఎవరన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆడియన్స్ ని మాయ చేద్దామని ఎంత ప్రయత్నించినా సరే అది కుదరట్లేదు. ఈమధ్య కాలంలో స్టార్ హీరోల బాడీ డబల్స్ కూడా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో లీక్స్ కూడా వీటికి కారణం అవుతున్నాయి. బాడీ డబల్ చేసే పర్సన్ ఇదివరకు అసలు బయట కనిపించే వారు కాదు. ఐతే సోషల్ మీడియా వచ్చాక వాళ్లు కూడా తమ పబ్లిసిటీ కోసం వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీసిన సినిమాల్లో కూడా బాడీ డబల్ ఉండటం వల్ల ఫ్యాన్స్ ఆ సీన్స్ ని అంత గొప్పగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

హీరోల డేట్స్ అడ్జెస్ట్ మెంట్ ఇంకా మిగతా కారణాల వల్ల..

అంతేకాదు ఏఐ టెక్నాలజీ వచ్చాక ఈ డౌట్ మరింత పెరిగింది. టెక్నాలజీ ఎంత ఉన్నా ఫ్యాన్స్ కి రియల్ స్టంట్, రియల్ యాక్షన్ ఫీల్ రావాలంటే ఆ హీరోతోనే ఆ సీన్స్ చేయించాలి. ఐతే హీరోల డేట్స్ అడ్జెస్ట్ మెంట్ ఇంకా మిగతా కారణాల వల్ల కూడా బాడీ డబుల్ ని ఎక్కువ యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు స్టార్స్ ఒక సినిమాకు కొన్ని రోజులు ఇచ్చి ఆ రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలన్న కండీషన్స్ వల్ల కూడా రియల్ స్టంట్స్ ని మిస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి హీరోలు కాస్త టైం తీసుకున్నా కూడా యాక్షన్ సీన్స్ సినిమాలో కొన్ని కీలక సీన్స్ లో అయినా బాడీ డబల్ ని వాడకపోతే బెటర్ దాని వల్ల సినిమా క్వాలిటీతో పాటు ఫ్యాన్స్ కి ఒక మంచి ఎక్స్ పీరియన్స్ కూడా ఇచ్చినట్టు అవుతుంది.

లేదు బాడీ డబల్ తోనే సినిమాలు చేస్తామని అనుకుంటే ఫ్యాన్స్ కి ఇంట్రెస్ట్ లేక అలాంటి సీన్స్ ని గుర్తించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఫ్యాన్స్ హెచ్చరికలను గుర్తించి సినిమా కంటెంట్ ఓకే చేసే టైం లోనే అన్ని విషయాలను చూసుకుంటే బెటర్. అభిమాన హీరో సినిమాలో అతని కన్నా ఎక్కువ బాడీ డబల్.. అదే డూప్ హీరో కనిపిస్తే కచ్చితంగా అలాంటి సినిమాలకు పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ తక్కువ అని చెప్పొచ్చు.