Begin typing your search above and press return to search.

బీటౌన్ హీరోతో తెలుగు యంగ్ డైరెక్టర్.. కాంబో సెట్ అయిందా?

బాలీవుడ్ హీరోతో మరో టాలీవుడ్ డైరెక్టర్ చేతులు కలపనున్నారా?.. ఇప్పుడు ఇదే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   5 March 2026 3:22 PM IST
బీటౌన్ హీరోతో తెలుగు యంగ్ డైరెక్టర్.. కాంబో సెట్ అయిందా?
X

బాలీవుడ్ హీరోతో మరో టాలీవుడ్ డైరెక్టర్ చేతులు కలపనున్నారా?.. ఇప్పుడు ఇదే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. తెలుగులో కమర్షియల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాబీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్‌ హీరోతో సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన కథను విన్న హీరో మరెవరో కాదు బాలీవుడ్ గ్రీకు గాడ్‌ హృతిక్ రోషన్ అని తెలుస్తోంది.

అయితే బాబీ కెరీర్‌ ను చూసుకుంటే.. మాస్ ఎంటర్టైనర్లతో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య మూవీ మంచి వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. కమర్షియల్ అంశాలు, ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్‌ ను మేనేజ్ చేసిన విధానం బాబీకి ప్రత్యేక ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. దీంతో స్టార్ హీరోలు కూడా ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాబీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బాలీవుడ్ వైపు ఆయన అడుగులు వేస్తున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఒక మంచి పాన్ ఇండియా కథతో బాబీ హృతిక్‌ ను సంప్రదించారని, ఆ కథ హీరోకు కూడా నచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలకు మరింత బలం చేకూర్చిన వ్యక్తి రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్. ఆయన తాజాగా నిర్మించిన బ్యాండ్ మేళం సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను, బాబీ కలిసి హృతిక్ కు ఓ కథను నేరేట్ చేశామని, త్వరలో ఆ ప్రాజెక్ట్ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఆ కాంబోపై ప్రకటన ఎప్పుడొస్తుందా అనే ఆసక్తి పెరిగింది.

అయితే బాబీ మాస్ స్టైల్, హృతిక్ రోషన్ యాక్షన్ ఇమేజ్ కలిస్తే పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా భారీ ప్రాజెక్ట్ అవుతుందని అనేక మంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ మేకింగ్ కలిస్తే ఆ మూవీ అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లో కచ్చితంగా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌ పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. చర్చలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. హృతిక్ ప్రస్తుతం ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటంతో డేట్స్ సెట్ అయితే ఆ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్ దర్శకుడికి బిగ్గెస్ట్ ఛాన్స్ అవుతుంది. దాంతోపాటు పాన్ ఇండియా రేంజ్ లో మరో భారీ ప్రాజెక్ట్‌ గా నిలిచే అవకాశముంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.