Begin typing your search above and press return to search.

సక్సెస్ ఉంటేనే పార్టీలకు పిలుస్తారు.. లేకపోతే ఇన్విటేషన్ కూడా ఇవ్వరు..

మరి ఆ హీరో ఎవరు? ఈ రేంజ్ లో నిజాలు బయట పెట్టడం వెనుక ఆయన అనుభవించిన పరిస్థితులు ఏంటి? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

By:  Madhu Reddy   |   17 Oct 2025 11:09 AM IST
సక్సెస్ ఉంటేనే పార్టీలకు పిలుస్తారు.. లేకపోతే ఇన్విటేషన్ కూడా ఇవ్వరు..
X

ఏ రంగంలో అయినా సరే ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే వెనుక డబ్బు అయినా ఉండాలి లేదా పలుకుబడి అయినా ఉండాలి.. లేదా మనం సెటిల్ అయిన రంగంలో సక్సెస్ అయినా సాధించి ఉండాలి అని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు నిర్మొహమాటంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక స్టార్ హీరో పలుకుబడి ఉంటేనే పార్టీలకు పిలుస్తారు.. పైగా సక్సెస్ లేదంటే కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వరు అంటూ ఊహించని కామెంట్లు చేశారు. మరి ఆ హీరో ఎవరు? ఈ రేంజ్ లో నిజాలు బయట పెట్టడం వెనుక ఆయన అనుభవించిన పరిస్థితులు ఏంటి? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఆయన ఎవరో కాదు బాబీ డియోల్.. ఇటీవల ప్రముఖ డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో మొదటి సినిమానే అయినా..తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు బాబీ డియోల్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సక్సెస్ ఉంటేనే ఎవరైనా దగ్గరికి వస్తారు. అదే లేకపోతే కనీసం పార్టీలకు ఇన్విటేషన్ కూడా ఇవ్వరు అంటూ ఊహించని కామెంట్లు చేశారు.

బాబీ డియోల్ మాట్లాడుతూ.. వరుస విజయాలతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోయినప్పుడు ఆడియన్స్ పెద్ద ఎత్తున అభిమానులుగా మారారు. కానీ ఒకానొక సమయంలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చినా.. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవడం ప్రారంభించినప్పుడు.. నా పక్కన ఎవరూ కూడా నిలబడలేదు. ఆ సమయంలో నా భార్య మాత్రమే నాకు అండగా నిలిచింది. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరుగుతుందేమో. మన దగ్గర సక్సెస్ ఉంటే ప్రతి ఒక్కరు మనల్ని పలకరిస్తారు. కానీ సక్సెస్ లేని నాడు వెంటనే సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు మనం ఒంటరి వాడిలా మిగిలిపోతాము. నాకు సక్సెస్ లేని సమయంలో...పార్టీలకు పిలిచే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు.

నిజానికి నాకు ఆహ్వానాలు అందలేదు. అందుకే నేను పార్టీలకు వెళ్లలేదు. నేను అగ్రస్థానంలో ఉన్నప్పుడు చాలామంది నాతో అప్యాయంగా ఉన్నారు. కానీ నేను ఫెయిల్యూర్ చూసినప్పుడు అదే వ్యక్తులు నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. ఇక అందరూ చెప్పే మాట ఏమిటంటే.. మీరు ఏదైనా ప్రజలకు అందించే వరకే ప్రజలు మీతో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ గా నిలబడతారో అప్పుడు మీ పక్కన ఒక్కరు కూడా నిలబడరు అని.. ఇది ఒక సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాలలో కూడా ఇలాగే జరుగుతుంది. ఒకప్పుడు నాకు అవకాశాలు ఇవ్వడానికి వెనుకడుగు వేసిన వారు ఇప్పుడు వారే స్వయంగా వచ్చే అవకాశాలు ఇస్తున్నారు.. అయితే నేను ఏ ఒక్కరిపై కూడా పగ పెంచుకోను. కష్టాల్లో కూడా అండగా నిలిచిన నా భార్యను మాత్రమే ఎప్పటికీ ఆరాధిస్తాను" అంటూ తెలిపారు. మొత్తానికి అయితే బాబి డియోల్ ఇండస్ట్రీలో జరిగే విషయాల గురించి స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు..