Begin typing your search above and press return to search.

అప్పుడు అమితాబ్‌ ఇప్పుడు బాబీ డియోల్‌..!

సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం.

By:  Ramesh Palla   |   22 Aug 2025 12:21 PM IST
అప్పుడు అమితాబ్‌ ఇప్పుడు బాబీ డియోల్‌..!
X

సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఎంతో మంది స్టార్‌ హీరోలు, హీరోయిన్స్ ఒక వయసు తర్వాత కనుమరుగు అవుతారు, చాలా మంది సినిమాలు చేయాలని అనుకున్నా ఆఫర్లు రావు. కొందరు హీరోలు వయసు మీద పడ్డ తర్వాత కూడా నటించాలని అనుకున్నా పెద్దగా స్పందన దక్కదు. కానీ కొందరు మాత్రం వయసు మీద పడ్డా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు కాకుండా కొందరు ఒకానొక సమయంలో ఫేడ్‌ ఔట్‌ అయ్యి తిరిగి ఫామ్‌ లోకి వచ్చిన వారు ఉంటారు. అందులో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆయన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేశారు. కానీ ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్‌ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఆయన తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

లేటు వయసులో అమితాబ్‌ బచ్చన్‌ రీ స్టార్ట్

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో చేసిన సర్కార్‌ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల కారణంగా అమితాబ్‌ లేటు వయసులో మరోసారి స్టార్‌ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమితాబ్‌ జోరు కొనసాగుతూనే ఉంది. ఇక సినిమాలు చేయడం కష్టమే అనుకున్న స్థాయి నుంచి ఇంకా సినిమాలు చేస్తున్నాడు అనే స్థాయికి అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ తరహాలోనే బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ వరుస సినిమాలు చేస్తున్నాడు. పదేళ్ల క్రితం వరకు బాబీ డియోల్‌ సినిమాల్లో ముందు ముందు కనిపించడని, ఆయన జర్నీ పూర్తి అయిందనే కామెంట్స్ చాలా మంది చేశారు. కానీ ఆయన లక్‌ కలిసి వచ్చింది. యానిమల్‌ సినిమాతో ఒక్కసారిగా బిజీ అయ్యాడు. యానిమల్‌లో ఆయన చేసిన పాత్ర కారణంగా బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.

యానిమల్‌ సినిమాతో బాబీ డియోల్‌ బిజీ బిజీ

బాబీ డియోల్‌ పని అయిపోయింది, ఆయన ఇండస్ట్రీలో ఒక కనుమరుగైన స్టార్‌గా నిలుస్తాడు అనుకుంటున్న సమయంలో చేసిన ప్రయత్నాలు వమ్ము కాలేదు. ఆయన సినిమా ఆఫర్ల కోసం ఎంతో మందిని అడిగారు. ఆయన ప్రయత్నాలు వమ్ము కాలేదని యానిమల్‌ సినిమాతో నిరూపితం అయ్యింది. ఫేడ్‌ ఔట్‌ అవుతున్నాడు అంటూ ప్రచారం జరిగిన సమయంలో బాబీ డియోల్‌ ఏడాదికి కనీసం ఒక్క సినిమాను చేయలేక పోయాడు. ఒకానొక సమయంలో మూడు ఏళ్లు ఆయన నుంచి సినిమా రాలేదు. అయినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేయడం ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఏడాదికి పది సినిమాలకు పైగా చేస్తూ దూసుకు పోతున్నాడు. స్టార్‌ హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌గా బాబీ డియోల్‌ నిలిచాడు. మరో వైపు హీరోగానూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.

డాకు మహారాజ్‌లో విలన్‌గా..

యానిమల్‌ సినిమా తర్వాత బాబీ డియోల్‌ మొత్తం మారిపోయింది. డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డ రోజుల నుంచి రోజుకు లక్షల పారితోషికం తీసుకునే రోజు వచ్చింది. అంతా కూడా యానిమల్‌ వల్లే అంటాడు బాబీ డియోల్‌. తెలుగులో ఈ మధ్య కాలంలో ఈయన చేసిన డాకు మహారాజ్‌, హరి హర వీరమల్లు సినిమాల్లోని పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో మరిన్ని సినిమాల్లో ఆయన నటించే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. బాబీ డియోల్‌ యొక్క క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఆయన లైనప్‌ చూస్తే అర్థం అవుతుంది. షారుఖ్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొంది, ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెబ్‌ సిరీస్‌లోనూ బాబీ డియోల్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, పలు భాషల్లో బాబీ డియోల్‌ బిజీ బిజీగా ఉన్నాడు.