బాబి మద్యం మానేయకపోతే..!
దశాబ్ధం పైగా అతడు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. అదే సమయంలో మత్తుకు బానిసయ్యాడు. ఆల్కహాలిక్ గా మారాడు. ఇంట్లో భార్య ఇచ్చే డబ్బులతో జీవించానని తెలిపాడు.
By: Sivaji Kontham | 28 Oct 2025 8:00 AM ISTఅలవాట్లు సరిగా లేకపోతే, క్రమశిక్షణ అనేదే లేకపోతే పరిశ్రమ అస్సలు సహించదు. అలాంటి వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. అది పరిశ్రమ వ్యక్తుల స్వభావం. ఈ విషయాన్ని గ్రహించలేక చతికిలబడ్డాడు బాబి అలియాస్ బాబి డియోల్. ధర్మేంద్ర వారసుడిగా అతడు పెద్ద స్థాయికి ఎదగాల్సినవాడు. కానీ అలవాట్ల కారణంగా, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా, విజయాలు అందుకోలేక అతడు రేసులో వెనకబడ్డాడు.
దశాబ్ధం పైగా అతడు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. అదే సమయంలో మత్తుకు బానిసయ్యాడు. ఆల్కహాలిక్ గా మారాడు. ఇంట్లో భార్య ఇచ్చే డబ్బులతో జీవించానని తెలిపాడు. ఇటీవల అతడు తన తప్పులన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా తాను ఆల్కహాల్ మానేశాక సంబంధాలు మెరుగయ్యాయని అంగీకరించాడు. తన అలవాట్లలో వచ్చిన మార్పు ఈ మేలు చేసిందని అన్నాడు. ఇటీవల మద్యం మానేయడం జీవితాన్ని మార్చేసిందని అన్నాడు. కొందరికి బానిసయ్యే స్వభావం జన్యువుల్లోనే ఉంటుందని కూడా బాబి అన్నాడు. నేను తాగుడు మానేసాక మంచి వాడిని అయ్యాను. ప్రతి ఒక్కరితో నాకు సంబంధాలు మెరుగయ్యాయి అని తెలిపాడు.
అలాగే బాబికి యానిమల్ పునర్జన్మనివ్వగా, ఇటీవలే ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` నటుడిగా మంచి పేరు తెచ్చింది. ఈ సిరీస్ మేకింగ్ విషయంలో ఆర్యన్ ఖాన్ పనితనంపై బాబి ప్రశంసలు కురిపించాడు. అతడి తండ్రి సూపర్ స్టార్ అయినా కానీ, ఆ నీడ పడకుండా తనను తాను ప్రత్యేకంగా ఆవిష్కరించుకోవడానికి సాహసం చేసాడని ఆర్యన్ ని ప్రశంసించాడు. ఆర్యన్ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాడు.
బాబి తదుపరి కొన్ని వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సందీప్ వంగా `యానిమల్ పార్క్` చిత్రంలోను నటించాల్సి ఉంది. ఇటీవల తెలుగు, తమిళ చిత్రాలకు బాబి అధిక ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే.
