బ్లడీ ఫైర్ స్టార్టర్..బ్లడీ రోమియో నెం.1 గ్యాంగ్‌స్టర్!
బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన కథలని ఎంచుకుంటూ కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు నేచురల్ స్టార్ నాని.
By: Ravindar Gorantla | 24 Feb 2026 11:56 AM ISTబ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన కథలని ఎంచుకుంటూ కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు నేచురల్ స్టార్ నాని. గత ఏడాది `హిట్:ది థర్డ్ కేస్`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని మాస్, క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న నాని ఈ ఏడాది మాస్ ప్రేక్షకుల్నే టార్గెట్ చేసినట్టున్నాడు. రెండు క్రేజీ మాసీవ్ యాక్షన్ డ్రామాలతో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో `ది ప్యారడైజ్` మూవీతో, సరికొత్త గెటప్‌తో రూపొందుతున్న రా అండ్ రస్టిక్ ఫిల్మ్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.
దీనితో పాటు మరో క్రేజీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల్ని `ఓజీ` మూవీతో థ్రిల్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్‌లో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాని చేస్తున్న విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. గురువారం (ఫిబ్రవరి 24) నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ని ప్రకటిస్తూ బ్లడ్ ఫైర్ స్టార్టర్ అంటూ ఓ అనౌన్స్‌మెంట్ వీడియోని రిలీజ్ చేశారు.
ఈ మూవీకి ముందు నుంచి వినిపిస్తున్న `బ్లడీ రోమియో` అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినీ లవర్స్‌ని, నాని అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో నాని గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. యూనిమేటెడ్ ఏఐ వీడియో ఆసక్తికరంగా సాగుతూ సినిమా ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇచ్చింది. గ్యాంగ్ స్టర్స్ డెన్ ని చూపిస్తూ ..ఎలా జరిగింది? షూటింగా.. అని ఓ వ్యక్తి అడిగితే వెన్నెల కిషోర్ `కాదు కూకింగ్` అనే వాయిస్‌తో దీన్ని మొదలు పెట్టారు.
ఏంటా రెసిపీ అంటే చిటికెడు కరుణ..పిడికెడు కోపం..బారెడు భీభత్సం...సరిపోయేంత..ఛఛ..సారీ మతిపోయేంత ప్రేమ... ఒక్కడు మిగిలాడు..` అంటూ ఈ మూవీలో విలన్స్ డెన్‌లో నాని చేసే భీభత్సం గురించి చిన్న ఇంట్లో ఇచ్చారు. ఈ వీడియోని చూస్తుంటే సినిమా ఓ రేంజ్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భీభత్సం సృష్టించేలా ఉంది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి. వీడియో ఎండింగ్‌లో నాని నంబర్ వన్ గ్యాంగ్ స్టార్ అంటూ చూపించి సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సమ్మర్‌లో ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ మాధురీ దీక్షిత్ ఓ కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నానికి జోడీగా క్రేజీ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ప్రస్తుతం ఇద్దరి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకరు `యానిమల్` బ్యూటీ త్రిప్తి దిమ్రీ కాగా మరొకరు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. సమ్మర్‌లో భారీ స్థాయిలో ప్రారంభః కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
