‘బైకర్’ ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్: స్పీడ్ పెంచిన శర్వా
సమ్మర్ సీజన్ మొదలవ్వగానే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హడావుడి మొదలైంది. ఈ ఏడాది వేసవి రేసులో శర్వానంద్ తన ‘బైకర్’ చిత్రంతో గట్టిగానే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు.
By: M Prashanth | 6 April 2026 1:13 PM ISTసమ్మర్ సీజన్ మొదలవ్వగానే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హడావుడి మొదలైంది. ఈ ఏడాది వేసవి రేసులో శర్వానంద్ తన ‘బైకర్’ చిత్రంతో గట్టిగానే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సాధారణంగా ఈ మధ్య కాలంలో సినిమాలకు మొదటి రోజు వచ్చే వసూళ్లు రెండో రోజుకు పడిపోతుంటాయి. కానీ ‘బైకర్’ విషయంలో సీన్ రివర్స్ అయింది.
రోజురోజుకూ ఈ సినిమా వసూళ్లు పెరుగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. శర్వానంద్ తన మార్క్ నటనతో మరోసారి ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ‘బైకర్’ సినిమా తన మొదటి వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 18.09 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శుక్రవారం డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, శనివారం పుంజుకుని, ఆదివారం నాటికి తన కెరీర్‌లోనే బెస్ట్ వసూళ్లను నమోదు చేసింది.
కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో ఉన్న తండ్రి కొడుకుల ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. యువతను రేసింగ్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటుంటే, పెద్దలను రాజశేఖర్, శర్వాల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు మెప్పిస్తున్నాయి. ఈ బ్యాలెన్స్‌డ్ కంటెంట్ వల్లే సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. సినిమాలోని డైలాగ్స్ కూడా కథకు తగ్గట్టుగా పవర్ ఫుల్‌గా ఉన్నాయి.
రాజశేఖర్ పాత్రలో ఉన్న ఏమోషన్ సినిమాకు ఒక వెయిట్ తీసుకొచ్చింది. ఎమోషనల్ డైలాగ్స్ థియేటర్లలో చప్పట్లు కురిపిస్తున్నాయి. విజువల్స్ పరంగా ‘బైకర్’ ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది. మోటో క్రాస్ రేసింగ్ ను వెండితెరపై చూపించడంలో టీమ్ చాలా కష్టపడినట్లు అర్థమవుతోంది. కెమెరా వర్క్ ఎడిటింగ్ రేసింగ్ సీన్లలో యూవీ క్రియేషన్స్ ఫ్యాషన్ కనిపించిందనే కామెంట్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా మట్టిలో బైక్ లతో చేసే విన్యాసాలు చాలా నేచురల్ గా ఉన్నాయి. యాక్షన్ బ్లాక్స్ లో వైలెన్స్ కంటే అడ్వెంచర్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు కూడా ఈ సినిమాను ఇష్టపడుతున్నారు. శర్వానంద్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రేసింగ్ లో ట్రైనింగ్ తీసుకోవడం ప్రతి ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలం మౌత్ టాక్. చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా చెప్పడం వల్ల వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు నిలకడగా ఉండే అవకాశం ఉంది.
శర్వానంద్ కెరీర్ లో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ తర్వాత అంతటి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇందులో చూస్తున్నామని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక నాయర్ పాత్ర కూడా కథలో చక్కగా ఒదిగిపోయింది. యూవీ క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ సినిమాను ఒక హై స్టాండర్డ్ లో నిలబెట్టాయి. మొత్తానికి ‘బైకర్’ తన ఫస్ట్ వీకెండ్ ను ఘనంగా ముగించింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తే శర్వానంద్ ఖాతాలో ఒక బిగ్గెస్ట్ హిట్ చేరడం ఖాయం. ఒక ప్రయోగంలా మొదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా వర్కవుట్ అవుతోంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
