Begin typing your search above and press return to search.

'బైకర్'తో శర్వా మాస్టర్ ప్లాన్!

'చార్మింగ్ స్టార్' శర్వానంద్ చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. 'ఒకే ఒక జీవితం' పర్వాలేదనిపించినా, ఆయన రేంజ్‌కు తగ్గ బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా పడలేదు.

By:  M Prashanth   |   30 Oct 2025 3:17 PM IST
బైకర్తో శర్వా మాస్టర్ ప్లాన్!
X

'చార్మింగ్ స్టార్' శర్వానంద్ చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. 'ఒకే ఒక జీవితం' పర్వాలేదనిపించినా, ఆయన రేంజ్‌కు తగ్గ బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా పడలేదు. రొటీన్ కథలు, ఫ్యామిలీ డ్రామాలు వర్కవుట్ అవ్వకపోవడంతో, శర్వా ఈసారి రూట్ మార్చినట్లున్నాడు. తన కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి, 'బైకర్' అనే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు.




ఈ సినిమా కోసం శర్వా డెడికేషన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. కేవలం కథ నచ్చి ఓకే చెప్పడమే కాదు, ఆ పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. 'బైకర్' లుక్ కోసం బరువు తగ్గి, చాలా లీన్‌గా తయారయ్యాడు. అంతేకాదు, ఇది రెగ్యులర్ యాక్షన్ కాదు, 'డర్ట్ బైక్ యాక్షన్' కావడంతో, ఏకంగా మూడు నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్, డైట్, జిమ్‌తో కష్టపడ్డాడని సమాచారం.

ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్ లాంటి బడా సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటంతో, టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. తెలుగు సినిమాకు 'డర్ట్ బైక్ రేసింగ్' అనేది చాలా కొత్త జానర్. శర్వా ఈ రిస్క్ తీసుకోవడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

అయితే, ఈ కొత్త జానర్‌ను ఆడియెన్స్‌కు కరెక్ట్‌గా ఎక్కించడానికి మేకర్స్ ఒక మాస్టర్ ప్రమోషనల్ ప్లాన్ వేశారు. 'బైకర్' నుంచి "ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్" పేరుతో ఒక టీజర్‌ను రెడీ చేశారు. కానీ, దాన్ని నేరుగా యూట్యూబ్‌లో వదలడం లేదు. ఇది చాలా స్మార్ట్ మూవ్. ఈ గ్లింప్స్‌ను అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ఈ వారం బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీగా ఉన్న 'బాహుబలి: ది ఎపిక్' రీ-రిలీజ్‌తో పాటు, రవితేజ 'మాస్ జాతర' సినిమా షోలతో పాటు దీన్ని అటాచ్ చేశారు.

అంటే, ఈ రెండు పెద్ద సినిమాలకు వచ్చే ప్రతీ ఆడియెన్, 'బైకర్' గ్లింప్స్‌ను బిగ్ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. థియేటర్‌లో చూసిన తర్వాత, ఆ బజ్‌ను కంటిన్యూ చేస్తూ, నవంబర్ 1న సాయంత్రం 4:05 గంటలకు ఈ గ్లింప్స్‌ను డిజిటల్‌గా రిలీజ్ చేయనున్నారు. ఒక కొత్త జానర్‌ను పరిచయం చేయడానికి ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ. శర్వా పడిన కష్టం, యూవీ ప్లానింగ్.. ఈ గ్లింప్స్‌తో వర్కవుట్ అయితే, శర్వాకు కావాల్సిన సాలిడ్ కమ్‌బ్యాక్ దొరికేసినట్లే.