బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. ఆమె చేతుల్లోనే అంతా..?
బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి మొదలు పెడతారన్న టాక్ నడుస్తుంది. 8 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కి రెడీ అవుతుంది.
By: Ramesh Boddu | 7 Aug 2025 11:28 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి మొదలు పెడతారన్న టాక్ నడుస్తుంది. 8 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కి రెడీ అవుతుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరెవరన్నది ఇప్పటికే చాలా రకాల లిస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఫైనల్ లిస్ట్ ఏంటన్నది షో మొదలయ్యాక తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పటిలానే కామన్ మ్యాన్ కి ఛాన్స్ ఉందట. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరిలో ఒకరిద్దరు కాదు చాలామందికి ఛాన్స్ ఉందట.
కామన్ మ్యాన్ ఎంపిక మొదలు..
బిగ్ బాస్ సీజన్ 9 లో 9 మంది సెలబ్రిటీస్ ఉంటే.. 9 మంది కామన్ మ్యాన్ ని తీసుకుంటారని టాక్. అందుకోసమే బిగ్ బాస్ టీం కామన్ మ్యాన్ ఎంపిక మొదలు పెట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన ఇన్విటేషన్ మేరకు చాలా అప్లికేషన్స్ వచ్చాయట. టీం అంతా వాళ్ల నుంచి వాళ్లకు హౌస్ లో ఉండటానికి కావాల్సిన వారిని వడకడుతున్నారట. ఐతే 40 మంది దాకా ఫైనల్ లిస్ట్ రెడీ చేశారని టాక్.
వీరిలో బిగ్ బాస్ కి వెళ్లేది ఎవరన్నది మరో టెస్ట్ ఉంటుందట. బిగ్ బాస్ సీజన్ 9 లో వెళ్లే కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ కి ముందే అగ్నిపరీక్ష పెట్టబోతున్నారు. అంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఎంపికైన వారిని యాజ్ ఇట్ ఈజ్ బిగ్ బాస్ టాస్కుల్లానే కొన్ని ఇస్తారట. అందులో గెలిచిన వారికే బిగ్ బాస్ 9 లో కంటెస్టెంట్ ఛాన్స్ ఇస్తారట.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష కి స్టార్ యాంకర్..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్ స్టార్ యాంకర్ శ్రీముఖిని తీసుకున్నారట. బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ గా నిలిచింది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 9 కి ముందు మొదలయ్యే బిగ్ బాస్ అగ్నిపరీక్షకు శ్రీముఖి హోస్ట్ చేస్తుంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా నాగార్జున రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ లో మొదలయ్యే ఈ సీజన్ సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇంకెందుకు ఆలస్యం. బిగ్ బాస్ లవర్స్ అంతా కూడా బిగ్ బాస్ 9 కి ముందే అగ్నిపరీక్ష షో కి రెడీ అయిపోవడం బెటర్. బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒకప్పటిలా కాకుండా ఒకరిద్దరు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
