Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఫైనల్ గా తనూజ కల నెరవేరిందిగా..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఎట్టకేలకు తనూజ కల నెరవేరింది. దాదాపు 10 వారాల్లో ఐదో వారం నుంచి ఆమె కెప్టెన్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తూ ఉంది.

By:  Ramesh Boddu   |   14 Nov 2025 12:26 PM IST
బిగ్ బాస్ 9.. ఫైనల్ గా తనూజ కల నెరవేరిందిగా..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఎట్టకేలకు తనూజ కల నెరవేరింది. దాదాపు 10 వారాల్లో ఐదో వారం నుంచి ఆమె కెప్టెన్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తూ ఉంది. ప్రతి వారం కెప్టెన్సీ రేసులో చివరి దాకా వచ్చి ఆమె ఓడిపోతుంది. లాస్ట్ వీక్ అయితే దివ్య వల్ల తనూజ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దివ్య తన పర్సనల్ ఎజెండాతో తనూజని కెప్టెన్ కాకూడదు అని అలా చేసింది. అందుకే వీకెండ్ నాగార్జున ఆమెకు వీడియోస్ చూపించి మరీ క్లాస్ పీకాడు.

బీబీ రాజ్యం టాస్క్ లో కెప్టెన్ గా..

ఇదిలా ఉంటే ఈ వారం జరిగిన బీబీ రాజ్యం టాస్క్ లో కెప్టెన్ గా రాజుగా ఉన్న నిఖిల్ తో పాటు రాణులుగా ఉన్న రీతు, తనూజ పోటీ పడ్డారు. ఐతే వీరి ముగ్గురికి క్రోన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ల ముగ్గురు కటౌట్స్ మీద ఉన్న క్రోన్ ని ఎవరైతే ఎక్కువసేపు కత్తితో పట్టుకుంటారో వారే ఈ టాస్క్ విజేతగా నిలిచి కెప్టెన్ అవ్వగలరని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో ముందు రీతు ఆ తర్వాత నిఖిల్ క్రోన్ కిందపడేలా చేస్తారు. తనూజ చివరి దాకా పట్టుకుని గెలుస్తుంది.

ఫైనల్ గా తన కెప్టెన్సీ కలని నిజం చేసుకుంది తనూజ. కెప్టెన్ గా అయ్యేందుకు చాలా కష్టపడి ఐదు వారాలు రన్నర్ గా నిలిచింది తనూజ. తను ఓడిపోయిన ప్రతిసారి చాలా అప్సెట్ గా కనిపించింది. తనూజ కెప్టెన్ అవ్వడం ఆమెను ఫాలో అవుతున్న ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. ఐతే తనూజ 10వ వారం కెప్టెన్ అయ్యింది. అంటే నెక్స్ట్ మళ్లీ 11వ వారం కెప్టెన్సీ టాస్క్ వరకు ఆమె కెప్టెన్ గా ఉంటుంది. 11వ వారం ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. సో తన ఇంట్లో వాళ్లు హౌస్ లోకి వచ్చే టైం కి తనూజ కెప్టెన్ గా ఉంటుంది.

3,4 వారాల్లో ఫైనల్ వీక్..

ఇక 11వ వారం ఫ్యామిలీ వీక్ తర్వాత మరో 3 వారాల్లో ఫైనల్ వీక్ ఉంటుంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ కెప్టెన్ అవ్వడం ఆ వారమే ఫ్యామిలీ వీక్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక ఈ సీజన్ విన్నర్ గా తనూజ రేసులో దూసుకెళ్తుంది. పోటీగా ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ ఉన్నారు. మిగతా వాళ్లు ఎవరు కూడా దరిదాపుల్లో కూడా లేరని తెలుస్తుంది.

సీజన్ 9 విన్నర్ ఎవరన్నది గెస్ చేయడం కష్టమే అవుతుంది. టాప్ 3గా తనూజ, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ దాదాపు కన్ ఫర్మ్ అనిపిస్తుండగా డీమాన్ పవన్ కి కూడా టాప్ 5 పాజిబిలిటీస్ ఉన్నాయి. అతను కూడా దానికి అర్హుడనే చెప్పొచ్చు. ఇక మిగిలిన ఒకటి రెండు ఛాన్స్ లకు రీతు, సంజన, సుమన్ శెట్టి పోటీ పడతారు. ఐతే ఆడియన్స్ ఎవరెవరిని ఈ సీజన్ టాప్ 5 లేదా 6 గా ఉంచాలని అనుకున్నారన్నది మరికొద్ది వారాల్లో తెలుస్తుంది.