బిగ్ బాస్ 9.. టికెట్ టు ఫినాలే రేసులో ఆ ముగ్గురు..?
బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ లో ఇప్పటికే సంజన, తనూజ ఇద్దరు ఆట నుంచి ఎలిమినేట్ అయ్యారు.
By: Ramesh Boddu | 4 Dec 2025 11:23 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ లో ఇప్పటికే సంజన, తనూజ ఇద్దరు ఆట నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆల్రెడీ ఒక టాస్క్ గెలిచి ఇమ్మాన్యుయెల్ ఫజిల్ లో ఎక్కువ స్పేస్ తో ఉన్నాడు. మరోపక్క తనూజతో టాస్క్ ఆడి గెలిచిన సుమన్ కూడా రెండో స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ కళ్యాణ్, డీమాన్ పవన్ కూడా ఆటలో దూకుడు చూపిస్తున్నారు. సుమన్ శెట్టి తన ప్రత్యర్ధిగా ఎవరిని ఎంపిక చేసుకున్నా అతను లాస్ అయ్యే అవకాశం ఉంది.
అటు ఫిజికల్, ఇటు మెంటల్ రెండిటిలో..
ఐతే ఇప్పుడు సుమన్ రేసులో ఉన్నా సరే ఎక్కడో ఒకచోట మిస్టేక్ చేయక తప్పదు. ఐతే కాన్ స్టంట్ గా అటు ఫిజికల్, ఇటు మెంటల్ రెండిటిలో ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ తమ ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఆ ముగ్గురిలోనే ఒకరికి ఈ టికెట్ టు ఫినాలే దక్కే ఛాన్స్ ఉందనిపిస్తుంది. ఇంతకీ ఎవరా ముగ్గురు అంటే ఒకరు ఇమ్మాన్యుయెల్ కాగా మరో ఇద్దరు కళ్యాణ్, డీమాన్ పవన్.
టాస్క్ అంటే చాలు ఇమ్మాన్యుయెల్ అదరగొట్టేస్తాడు. అటు ఎంటర్టైన్మెంట్ లో కూడా అతడే కింగ్. ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్ ఆడిన ప్రతి టాస్క్ ఒకటి రెండు తప్ప అన్నీ తానే గెలుస్తూ వచ్చాడు. ఇక హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ కూడా టాస్క్ ఏదైనా సరే చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. అసలే ఈ వారం నామినేషన్స్ టైం లో టికెట్ టు ఫినాలే తనదే అని హౌస్ మేట్స్ కి ఛాలెంజ్ చేశాడు.
టాస్క్ లో భరణి, రీతు, సుమన్ ఉన్నా కూడా..
కళ్యాణ్ పడాల కూడా టికెట్ టు ఫినాలే టాస్క్ లో తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం రేసులో భరణి, రీతు, సుమన్ ఉన్నా కూడా ఈ ముగ్గురితో ఆ ముగ్గురు టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నారు. సో టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, కళ్యాణ్ దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ ముగ్గురికి కూడా కచ్చితంగా టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఐతే టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మరి నెక్స్ట్ టాస్క్ లల్లో ఎవరు ముందుకు వెళ్తారు.. ఎవరు ఓడిపోయి వెనకపడతారు అన్నది చూడాలి.
ఐతే టికెట్ టు ఫినాలే కోసం సుమన్, భరణి, రీతు ఈ ముగ్గురు బాగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మిగతా వారితో పోల్చుకుంటే ఈ ముగ్గురు ఫైనల్ వీక్ దాకా ఉండటం అదే టాప్ 5 కి వెళ్తారన్నది కాస్త డౌట్ అందుకే ఆడియన్స్ ఓటింగ్ తో కాదు టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడి ఫైనల్ వీక్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
