Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఆమె కాదు అతడు ఎలిమినేట్..!

బిగ్ బాస్ సీజన్ 9 లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. శనివారం రోజే ఆదివారం ఎపిసోడ్ కూడా షూట్ చేస్తారు.

By:  Ramesh Boddu   |   21 Sept 2025 10:13 AM IST
బిగ్ బాస్ 9.. ఆమె కాదు అతడు ఎలిమినేట్..!
X

బిగ్ బాస్ సీజన్ 9 లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. శనివారం రోజే ఆదివారం ఎపిసోడ్ కూడా షూట్ చేస్తారు. దాని నుంచి ఎంత లీక్ కాకూడదు అనుకున్నా లీక్ అవుతుంది. అలా ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అన్నది ఆల్రెడీ లీక్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి వారం శ్రష్టి వర్మ బయటకు వచ్చింది. ఆమె ఇంకా ఓపెన్ అవ్వకముందే ఆడియన్స్ ఆమెను బయటకు పంపించేశారు. నెక్స్ట్ ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో నిన్నటి వరకు ఒక లేడీ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వస్తారని అనుకున్నారు.

ప్రియా శెట్టి ఎలిమినేట్..

కానీ ట్విస్ట్ ఏంటంటే లేడీ కాదు మేల్ కంటెస్టెంట్ అది కూడా బిగ్ బాస్ కామనర్స్ నుంచి అగ్నిపరీక్ష అంటూ షో చేశారు కదా దాన్ని దాటుకుని వెళ్లిన ఒక వ్యక్తి ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారట. సీజన్ 9 నుంచి రెండో వారం నిన్నటి వరకు ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరు అనుకున్నారు. ఆమె చేసే అతి హౌస్ లో అందరినీ డిస్ట్రబ్ చేస్తుంది. కావాలని ఏదో పాయింట్ లేవనెత్తి దాని మీద గొడవ పెడుతుందన్న భావన ఉంది.

ఆమెకు తోడు శ్రీజ చేసే అతి మరి కాస్త డ్యామేజ్ చేస్తుంది. హౌస్ లో ఎక్కువ ఏదైనా గొడవ జరిగితే అది ప్రియా, శ్రీజ వల్లే అనిపిస్తుంది. అందుకే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ప్రియాకి బై బై చెప్పేస్తారని అనుకున్నారు. కానీ ఆడియన్స్ మనీష్ మర్యాదని బయటకు పంపించారు. అతను కూడా ఓనర్స్ టీం లో ఉండి మొన్నటిదాకా కాస్త ఎక్కువ చేసినట్టే అనిపించింది. ఈమధ్యనే అసలు ఆట తీరు అర్ధం చేసుకుని టెనంట్స్ తో కలుస్తున్నాడు. ముఖ్యంగా ప్రియా, శ్రీజాల మీద మనీష్ కాస్త అప్సెట్ గా ఉన్నాడు.

ఎపిసోడ్ లో మనీష్ ఎమోషనల్..

శనివారం ఎపిసోడ్ లో కూడా నాగార్జున ముందు మనీష్ ఎమోషనల్ అయినట్టు కనిపించాడు. ఐతే అతనే ఈ వారం ఎలిమినేట్ అవ్వడం షాక్ ఇస్తుంది. మనీష్ తన ఒరిజినల్ గేం ఇప్పుడే మొదలు పెట్టాడు. కానీ ఈలోగా అతను హౌస్ కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 9 లో ఓనర్స్, టెనంట్స్ గా రెండు వారాలు జరిగాయి. ఐతే నిన్న శనివారం ఎపిసోడ్ లో ఓనర్స్ ని టెనంట్స్ గా.. టెనంట్స్ ని ఓనర్స్ గా షిఫ్ట్ చేశాడు నాగార్జున. ఐతే టెనంట్ గా ఉంటూ ఓనర్ గా టాస్క్ గెలిచి వెళ్లిన భరణి, రాము రాథోడ్ మాత్రం ఓనర్స్ గానే ఉంటారు. సో మొత్తానికి నిన్నటి దాకా ఓనర్స్ గా ఉన్న వాళ్లు టెనంట్స్ అవుతారు. టెనంట్స్ కూడా ఓనర్స్ గా మారుతారు.