Begin typing your search above and press return to search.

భరణి కోసం నిహారిక.. నాగార్జునతో చర్చ..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్, ఎలిమినేషన్స్ అనేవి ఎవరి చేతుల్లో ఉంటాయో తెలిసిందే. నామినేషన్స్ హౌస్ మేట్స్ అంతా కలిసి ఎవరిని నామినేట్ చేయాలో వారి వారి అభిప్రాయాలు, పాయింట్స్ పెట్టి చేస్తారు.

By:  Ramesh Boddu   |   9 Dec 2025 10:06 AM IST
భరణి కోసం నిహారిక.. నాగార్జునతో చర్చ..!
X

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్, ఎలిమినేషన్స్ అనేవి ఎవరి చేతుల్లో ఉంటాయో తెలిసిందే. నామినేషన్స్ హౌస్ మేట్స్ అంతా కలిసి ఎవరిని నామినేట్ చేయాలో వారి వారి అభిప్రాయాలు, పాయింట్స్ పెట్టి చేస్తారు. ఇక నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఎవరిని కొనసాగించాలి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్నది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. వాళ్లు ఓట్ వేస్తే లీస్ట్ ఓటింగ్ వచ్చిన వారే ఎలిమినేట్ అవుతారు. ఇది కేవలం తెలుగులోనే కాదు ఏ భాషలో బిగ్ బాస్ ప్రక్రియ అయినా ఎన్ని సీజన్లు అయినా ఇలానే జరుగుతుంది.

ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే ఎలిమినేషన్స్..

ఐతే బిగ్ బాస్ తెలుగు దగ్గరకు వచ్చే సరికి కొంత ఫేవరిజం చూపిస్తారని. తెలిసిన వాళ్లను.. కాస్త క్రేజ్ ఉన్న వాళ్లను ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా హౌస్ లో కొనసాగిస్తారని అంటుంటారు. ఐతే ఎలిమినేషన్స్ అనేది ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే జరుగుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ రీ ఎంట్రీలు ఇంకా ఎలిమినేషన్స్ క్యాన్సిలేషన్స్ అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతాయి.

బిగ్ బాస్ సీజన్ 9లో ఇలానే భరణి ఒకసారి ఎలిమినేట్ అయినా శ్రీజాతో అతన్ని హౌస్ లోకి తీసుకొచ్చారు. ఈ సీజన్ భరణికి కాస్త ఫేవరిజం చూపిస్తున్నారన్న టాక్ నడిచింది. దానికి బలం ఇస్తూ లేటెస్ట్ గా నాగార్జున, నిహారిక ఒక ఈవెంట్ లో బిగ్ బాస్ గురించి మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. నాగార్జున దగ్గర నిహారిక బిగ్ బాస్ భరణి గురించి ప్రస్తావించగా మీ నాన్న గురువు అంట కదా అని అంటుంది. అది చూసిన కొందరు భరణిని స్పెషల్ కేటగిరి కింద టాప్ 5లో ఉంచేలా రికమెండ్ చేస్తున్నారనే చర్చ నడుస్తుంది.

బిగ్ బాస్ టీం తీసుకునే డెసిషన్..

బిగ్ బాస్ సీజన్ 5లో భరణిని టాప్ 5లో ఉంచేందుకే ఇలా చేస్తున్నారని ఒక టాక్ నడుస్తుండగా ఇప్పుడు నాగార్జున, నిహారిక బిగ్ బాస్ డిస్కషన్ మరింత డౌట్ పెంచేలా చేసింది. ఐతే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఎవరు ఎప్పుడు ఎలా బయటకు వస్తారన్నది వాళ్ల కండీషన్స్ కి ఆమోదం తెలిపే.. బిగ్ బాస్ టీం తీసుకునే ఎలాంటి డెసిషన్ కి అయినా ఓకే చెప్పే అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ఇందులో ఆడియన్స్ ఓటింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఎలాంటి మిస్ లీడ్స్, రికమెండేషన్స్ ఉండే ఛాన్స్ లేదు. భరణి టాప్ 5కి వెళ్తాడా లేదా అన్నది పక్కన పెడితే అతని గురించి హోస్ట్ మాట్లాడటం ఆడియన్స్ లో డౌట్స్ పెంచేలా చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో అందరు సమానమే అందులో ఆల్రెడీ కామనర్స్ కూడా ఉన్నారు. ఈ సీజన్ ఆల్రెడీ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ గా మొదలైంది. ఈ ప్రాసెస్ లో ఎవరు ఆట బాగా ఆడితే వారికే ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ కొందరు ఆట సరిగా ఆడకపోయినా ఆడియన్స్ ఓటింగ్ తో అలా వారాలు గడిపేస్తారు. ఏది ఏమైనా ఫైనల్ గా టాప్ 5 మాత్రం డిజర్వ్ కంటెస్టెంట్స్ ఉంటారని చెప్పొచ్చు.