బిగ్ బాస్ 9.. బాబోయ్ అయేషా ఏంటిది.. సుమ గౌరవ్ సూపర్ హిట్..!
బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వచ్చారు. వారిలో అయేషా చాలా యాక్టివ్ గా కనిపించింది.
By: Ramesh Boddu | 18 Oct 2025 9:02 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వచ్చారు. వారిలో అయేషా చాలా యాక్టివ్ గా కనిపించింది. ఆమె ఉత్సాహం చూసి తెలుగు ఆడియన్స్ షాక్ అయ్యారు. చెన్నై నుంచి ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో ఆమె వచ్చిందని నాగార్జున రివీల్ చేశారు. ఇక హౌస్ లో వచ్చీ రాగానే నామినేషన్స్ టైంలో హౌస్ లో బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదంటూ ఓల్డ్ కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యింది. తనూజని ఎటాక్ చేస్తూ సీరియల్ ఏడుపులు ఆపాలని అన్నది.
టాస్క్ లో సుమన్ శెట్టి, గౌరవ్ గెలిచి..
ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో మాధురి, అయేషా కలిసి టీం అప్ అయ్యి ఈ టాస్క్ ఆడగా అందులో అయేషా వల్ల వాళ్లు ఓడిపోయారు. దానికి తనకు స్పెడ్స్ ఉండటం వల్లే సరిగా కనిపించక ఆ లాక్ ఓపెన్ చేయలేదని ఆమె ఏడ్చింది. అంతేకాదు తనంతట తానే చెంపలు చెంపలు కొట్టుకుంది. అది చూసిన మిగతా హౌస్ మెట్స్ అంతా షాక్ అయ్యారు. అయేషా వచ్చిన దగ్గర నుంచి చాలా యాక్టివ్ గా ఉంది కానీ ఇలా ఆమె బిహేవ్ చేస్తుందని ఎవరు ఊహించలేదు.
కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి, గౌరవ్ గెలిచి కెప్టెన్ గా నిలిచారు. ఐతే నిఖిల్ కు ఆల్రెడీ హౌస్ లోకి వచ్చేప్పుడు కెప్టెన్సీ కంటెండర్ షిప్ అవకాశం ఉంటుందని చెప్పగా.. కెప్టెన్ గా అయిన ఈ ఇద్దరిలో ఎవరితో నువ్వు పోటీ పడతావ్ అనగా గౌరవ్ ని ఎంచుకున్నాడు నిఖిల్. అలా నిఖిల్, గౌరవ్ లకు ఒక వెయిట్ టాస్క్ ఇచ్చి వాళ్లిద్దరి బలాలను టెస్ట్ చేశాడు. ఫైనల్ గా ఆ టాస్క్ లో కూడా గౌరవ్ గెలిచి కెప్టెన్ గా తన బ్యాడ్జ్ ని తిరిగి సంపాధించాడు.
ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్..
మొత్తానికి హౌస్ లో ఆటకు ఆట.. ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఉంటున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. రాము, దివ్య ఇద్దరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉందనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం ఆట ఆడియన్స్ ని అలరించింది. ముఖ్యంగా కెప్టెన్ గా సుమన్ శెట్టి ప్రమాణ స్వీకారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అంటూ ఫైర్ స్టోర్మ్ ని హౌస్ లోకి పంపించిన బిగ్ బాస్. వచ్చిన ఆరుగురిలో ఒకరిద్దరు ఏమో కానీ మిగతా వారంతా ఏదో ఒక విధంగా పాత కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. మాధురి అయితే వాయిస్ తో తన డామినేషన్ చూపిస్తున్నారు. హౌస్ లో ఆమె వల్ల చాలా గొడవలు జరిగేలా ఉన్నాయి.
