Begin typing your search above and press return to search.

రీతు పవన్.. ఆట చెడగొట్టుకుంటున్నారు ఎందుకు..?

బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్ లు కామన్. వారి అభిరుచికి తగినట్టుగా హౌస్ లో ఉన్న వాళ్లని ఒకరిని ఎంపిక చేసుకుని వాళ్లతోనే టైం స్పెండ్ చేస్తుంటారు

By:  Ramesh Boddu   |   26 Oct 2025 11:23 AM IST
రీతు పవన్.. ఆట చెడగొట్టుకుంటున్నారు ఎందుకు..?
X

బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్ లు కామన్. వారి అభిరుచికి తగినట్టుగా హౌస్ లో ఉన్న వాళ్లని ఒకరిని ఎంపిక చేసుకుని వాళ్లతోనే టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక వారాలు గడుస్తున్నా కొద్దీ ఇంకాస్త క్లోజ్ అవుతారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో కూడా రీతు, డీమాన్ పవన్ మధ్య బాండింగ్ ఏర్పడింది. ఐతే వాళ్లిద్దరు అది స్నేహం అంటున్నారు. కానీ రీతు మాత్రం కాస్త ఎక్కువగానే పవన్ ని డిస్ట్రబ్ చేస్తుంది. పవన్ కోసం రీతు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అటు నుంచి వస్తుంది కాబట్టి పవన్ కూడా అలానే చేస్తున్నాడు.

పవన్ ట్రై చేస్తున్నాడు కానీ ఓటమి ఎదురవుతుంది..

ఐతే పర్సనల్ గా ఎమోషనల్ గా క్లోజ్ అయిన వీరు ఆట విషయానికి వస్తే వాళ్లు ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. రీతు వేరే టీం లో ఉన్నా కూడా పవన్ కి సపోర్ట్ చేస్తుంది. పవన్ కూడా గెలవడం కోసం ట్రై చేస్తున్నాడు కానీ ప్రతిసారి అతనికి ఓటమి ఎదురవుతుంది. లాస్ట్ వీక్ జరిగిన దొంగల టాస్క్ లో కూడా పవన్ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి. రీతు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయినా కూడా పవన్ కి ఒక్కడికే మొత్తం అమౌంట్ ఇవ్వకుండా అందరికీ పంచేసింది.

ఈ విషయంపై పవన్, రీతు మధ్య చిన్న వాదన జరిగింది. రీతు వెర్షన్ ఏంటంటే పవన్ కోసం తను సపోర్ట్ గా ఉన్నా కూడా అతను అర్ధం చేసుకోవట్లేదని ఫీల్ అవుతుంది. పవన్ వెర్షన్ ఏమో.. ఆమె మొత్తం తనకే ఇస్తే తను కూడా కెప్టెన్సీ రేసులో ఉండే వాడిని కదా అని.. ఇక్కడ ఎవరి వెర్షన్ వారిది అయినా ఇద్దరు కలిసి ఇద్దరి ఆటని చెడగొట్టుకుంటున్నారు. మరోపక్క రీతు తన వాయిస్ డామినేషన్ వల్ల మాధురితో, మొన్నటిదాకా అయేషాతో గొడవ పడి కాస్త నెగిటివిటీ ఏర్పరచుకుంటుంది.

రీతు, పవన్ రిలేషన్ మించి కన్ ఫ్యూజన్..

ఎలాగైనా తాను గెలవాలనే ప్లానింగ్ తో రీతు ఆడియన్స్ కొన్ని విషయాలు మన జెన్యునిటీని చూస్తారన్న విషయం మర్చిపోతుంది. పవన్ కూడా ఆట మీద సరిగా ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. ఇలా రీతు, పవన్ ఇద్దరి మధ్య రిలేషన్ ఇంకా దానికి మించి కన్ ఫ్యూజన్ తో ఆట మొత్తం నాశనం చేసుకుంటున్నారు. మరి వీరి బాండింగ్ పక్కన పెట్టి ఆట ఆడితే బెటర్ అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.

రీతు పవన్ కి సపోర్ట్ గా ఉంటున్నా ఆట విషయానికి వచ్చేసరికి తన ఆటే ముఖ్యమని ఫీల్ అవుతుంది. అది ఆడియన్స్ కి డిఫరెంట్ గా వెళ్తుంది. పైకి పవన్ కోసం ఏదైనా చేస్తా అని చెప్పి ఇలా అతన్ని ఎందుకు డిస్ట్రబ్ చేస్తుందని అనుకుంటున్నారు.