Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపించిన నాగార్జున..!

బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం జరిగే టాస్కులు, ఫైట్లు ఒక లెక్కైతే.. వీకెండ్ లో హోస్ట్ నాగార్జునతో జరిగే డిస్కషన్.. ఆయన చెప్పే పాయింట్స్ మరో ఎత్తు అనేలా ఉంటాయి.

By:  Ramesh Boddu   |   5 Oct 2025 9:27 AM IST
బిగ్ బాస్ 9.. కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపించిన నాగార్జున..!
X

బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం జరిగే టాస్కులు, ఫైట్లు ఒక లెక్కైతే.. వీకెండ్ లో హోస్ట్ నాగార్జునతో జరిగే డిస్కషన్.. ఆయన చెప్పే పాయింట్స్ మరో ఎత్తు అనేలా ఉంటాయి. బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో దాన్ని హౌస్ మెట్స్ కి చేరవేస్తూ నాగార్జున చేసే హోస్టింగ్ అదిరిపోతుంది. ఈ సీజన్ లో నాగార్జున కూడా కొంత ఎపిసోడ్ ని ఫాలో అవుతున్నట్టే ఉన్నాడు. ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అందరి కంటెస్టెంట్స్ గురించి మాట్లాడాడు.

గోల్డ్ స్టార్, సిల్వర్, బ్లాక్ స్టార్స్..

ముందుగా రాము రాథోడ్ కెప్టెన్ అయినందుకు అభినందించాడు నాగార్జున. ఇక హౌస్ మెట్స్ కి ఈ నాలుగు వారాల ఆటని పరిగణలో తీసుకుని వాళ్లకు గోల్డ్ స్టార్, సిల్వర్, బ్లాక్ స్టార్స్ ని కేటాయించాడు. హౌస్ లో ఇమ్మాన్యుయెల్ ఒక్కడికే గోల్డ్ స్టార్ వచ్చింది. హరీష్, ఫ్లోరా షైనీ ఇద్దరికే బ్లాక్ స్టార్ వచ్చింది. ఐతే ఈ ఇద్దరిలో కూడా హౌస్ లో ఉండటానికి ఎవరికి అర్హత లేదన్నది మిగతా హౌస్ మెట్స్ కి ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు నాగార్జున.

దానిలో మెజారిటీ పీపుల్ ఫ్లోరా షైనీనే అన్ డిజర్వ్ అని జడ్జిమెంట్ ఇచ్చారు. ఆమె ఇంకా హౌస్ లో అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలని.. షాడోలా ఒకరి పక్కన ఉంటుందని.. తనకంటూ సొంత నిర్ణయాలు తీసుకోదని చెప్పారు. అలానే హరీష్ గురించి కూడా ముగ్గురు నలుగురు హౌస్ లో తానొక్కడు ఒక వైపు మిగతా హౌస్ అంతా మరో వైపు అనేలా చేస్తున్నాడని చెప్పారు. సో అలా ఫ్లోరాకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి. ఆమెను నెక్స్ట్ రెండు వారాలు డైరెక్ట్ నామినేషన్స్ లోకి తీసుకొచ్చారు నాగార్జున.

ఫ్లోరా నాలుగో వారం కూడా..

హౌస్ మెట్స్ ఎవరు ఈ రెండు వారాల్లో ఫ్లోరాని నామినేట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెను ఆల్రెడీ బిగ్ బాస్ రెండు వారాలు నామినేషన్స్ లో ఉంచారు. సో ఫ్లోరా నాలుగో వారం కూడా డిజప్పాయింట్ చేస్తుంది. ఈ వీక్ ఆమె నామినేషన్స్ లో ఉంది. ఐతే ఆమెకన్నా హరీష్ ని ఆడియన్స్ హౌస్ లో ఉంచాలని అనుకోవట్లేదు. అందుకే అతనికి తక్కువ ఓటింగ్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో నాగార్జున ప్రతి వీకెండ్ హౌస్ మెట్స్ కి చెప్పాల్సిన పాయింట్స్ తో పాటు ఇవ్వాల్సిన క్లాస్ కూడా ఇస్తున్నారు. సంజన ఎగ్స్ దొంగతనంగా తినడం గురించి ఆమెను ఫ్రాంక్ అనేది అవతల వాళ్లని హర్ట్ చేయకూడదు అని ఆమె మెడలో దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డ్ వేశాడు. మరి ఇప్పటికైనా సంజన తన ఆట తీరుని మార్చేస్తుందా లేదా అన్నది చూడాలి.