బిగ్ బాస్ 9.. సినిమా క్లైమాక్స్ రేంజ్ లో కెప్టెన్సీ టాస్క్.. గెలిచింది ఎవరంటే..?
బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం కెప్టెన్ గా గెలిచాడు కళ్యాణ్ పడాల. హౌస్ లో మరో 3 వారాలు మాత్రమే ఉండగా చివరి కెప్టెన్సీ టాస్క్ నడిచింది.
By: Ramesh Boddu | 29 Nov 2025 1:11 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం కెప్టెన్ గా గెలిచాడు కళ్యాణ్ పడాల. హౌస్ లో మరో 3 వారాలు మాత్రమే ఉండగా చివరి కెప్టెన్సీ టాస్క్ నడిచింది. ఐతే ఈ టాస్క్ లో ఫైనల్ రౌండ్ లో కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్ ఇద్దరు పోటీ పడ్డారు. రోడ్ టు ద కెప్టెన్ అంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు.
ఈ టాస్క్ లో రోడ్ లాంటి సెటప్ చేసి దానికి ఉన్న గుంతలను కంకర, ఇసుక వేసి పైన ఇచ్చిన ఆ మార్క్ ప్లేట్ పెట్టి దానికి స్టిక్కర్ వేయాలి. అలా ఎవరైతే కరెక్ట్ గా ముందు చేస్తారో వాళ్లే ఈ కెప్టెన్ అవుతారు. ఐతే కళ్యాణ్, డీమాన్ పవన్ ఇద్దరు ఫిజికల్ గా మంచి ఎజర్జిటిక్ గా ఉంటారు. వారిద్దరికి సరైన టాస్క్ గా ఇది కనిపించింది.
డీమాన్ పవన్ ఒక దశలో బ్యాక్ పెయిన్ ఎక్కువయ్యి..
ఐతే టాస్క్ మొదలైనప్పుడు డీమాన్ పవన్ త్వరగా చేసినట్టు కనిపించినా మధ్యలో అతనికి బ్యాక్ పెయిన్ రావడంతో అతను చాలా కష్టపడ్డాడు. కళ్యాణ్ కూడా తనకు కష్టం అనిపిస్తున్నా కూడా అలానే తను చేయాల్సిన పని చేస్తూ వచ్చాడు. డీమాన్ పవన్ ఒక దశలో బ్యాక్ పెయిన్ ఎక్కువయ్యి అక్కడ పడుకున్నాడు. అయినా కూడా వదలకుండా టాస్క్ చివరి వరకు కొనసాగించాడు. ఐతే ఫైనల్ గా కళ్యాణ్ పడాల టాస్క్ గెలిచి సీజన్ 9లో చివరి కెప్టెన్ అయ్యాడు.
సీజన్ 9లో కామనర్ గా హౌస్ లోకి వచ్చాడు కళ్యాణ్ పడాల. ఆర్మీ నుంచి అతను బిగ్ బాస్ కి రావడం బయట కొంత ఫాలోయింగ్ ఏర్పడగా హౌస్ లో అతని నిజాయితీ, ఆట తీరు అందరినీ అలరించింది. ఇక చివరి వారం కెప్టెన్ గా డీమాన్ పవన్ కి సరైన ఫైట్ ఇచ్చి కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఐతే కెప్టెన్ గా గెలిచినా సరే డీమాన్ పవన్ కి బ్యాక్ పెయిన్ వచ్చినందుకు కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు.
బిగ్ బాస్ ఆడియన్స్ కి కూడా ఈ టాస్క్ సూపర్..
అటు ఓ పక్క మెడికల్ రూమ్ కి వెళ్లొచ్చిన డీమాన్ పవన్ కూడా రీతూతో గెలిచింది కూడా మనోడే కదా అని అన్నాడు. ఈ ఇద్దరు ఆడిన ఈ టాస్క్ ఒక సినిమా క్లైమాక్స్ రేంజ్ లో ఉంది. బిగ్ బాస్ ఆడియన్స్ కి కూడా ఈ టాస్క్ సూపర్ అనిపించింది. కళ్యాణ్, డీమాన్ పవన్ ఈ టాస్క్ తో టాప్ 5కి అర్హులు అనిపించేశారు. ముఖ్యంగా డీమాన్ పవన్ అంత పెయిన్ లో కూడా ఆటని పూర్తి చేయాలనే అతని తపన ఇంప్రెస్ చేసింది.
