బిగ్ బాస్ 9.. కళ్యాణ్ కి అన్యాయం చేసిన దివ్య రెబల్ ట్విస్ట్..!
గార్డెన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సోఫా ఏరియాలో ఫోన్ ఉంచి ఆ ఫోన్ మోగితే ఎవరో ఒకరు పిక్ చేయాల్సి ఉంటుంది.
By: Ramesh Boddu | 5 Nov 2025 10:05 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. గార్డెన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సోఫా ఏరియాలో ఫోన్ ఉంచి ఆ ఫోన్ మోగితే ఎవరో ఒకరు పిక్ చేయాల్సి ఉంటుంది. ముందు ఫోన్ ని తనూజ లిఫ్ట్ చేస్తుంది. ఐతే ఇక మీదట ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఇలానే జరుగుతుందని.. ఈ విషయాన్ని కంటెస్టెంట్స్ కి చెప్పండని అంటాడు బిగ్ బాస్. ఇక నెక్స్ట్ సంజన లిఫ్ట్ చేసి రీతుకి ఇస్తుంది. ఆమెకు హౌస్ లో రెబల్ ఉన్నాడు అతనెవరో కనిపెట్టాలని అంటాడు. సుమన్ శెట్టి ఫోన్ ఎత్తగా అతన్ని రెబల్ అని చెప్పిన బిగ్ బాస్ అతను చేయాల్సిన కొన్ని టాస్క్ లు ఇస్తాడు.
వాష్ రూం లో కింద డెస్క్ లో ఆ టాస్క్ కు సంబంధించిన పేపర్ ఉంటుంది. దాన్ని సుమన్ తన దగ్గర పెట్టుకుంటాడు. ఐతే సుమన్ ఈ టాస్క్ ని సరిగా చేయట్లేదు అని దివ్యాని రెబల్ చేస్తాడు బిగ్ బాస్. కళ్యాణ్ ఫోన్ ఎత్తి దివ్యాకి ఫోన్ ఇస్తాడు. ఐతే దివ్య సీక్రెట్ టాస్క్ లో భాగంగా ముగ్గురు హౌస్ మెట్స్ ని వారు కూర్చున్న ప్లేస్ నుంచి లేపితే చాలు. అలా దివ్య ముందు భరణిని ఆ తర్వాత కళ్యాణ్ ని, నెక్స్ట్ గౌరవ్ ని లేపి కూర్చుంటుంది. ఐతే గౌరవ్ ది పరిగణలోకి తీసుకుంటారో లేదో అని మళ్లీ రీతుని చెయిర్ నుంచి లేపుతుంది. ఆ టైం లో డీమాన్ పవన్ రీతుకి అన్నం తినిపిస్తాడు. దివ్య ప్రవర్తనకు రీతు హర్ట్ అవుతుంది.
రీతుకి కళ్యాణ్ వెళ్లి వివరించే ప్రయత్నం చేసినా వినదు. ఇక దివ్యా సీక్రెట్ టాస్క్ లో భాగంగా సుమన్ తో పాలు తాగిస్తుంది. మిగతా కంటెస్టెంట్స్ అంతా నిద్రపోతుంటారు. ఐతే దివ్య, సుమన్ కిచెన్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ కూడా వచ్చి చూస్తాడు. అతనికి డౌట్ రాకుండా దివ్య, సుమన్ మ్యానేజ్ చేస్తారు. ఐతే కళ్యాణ్, భరణి, రీతు లను కూర్చున్న చోట నుంచి లేపింది కాబట్టి రెబల్ గా సూపర్ ఛాన్స్ పొందారు దివ్య, సుమన్. ఆటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ కాకుండ ఎలిమినేట్ చేస్తుంది. దివ్య, కళ్యాణ్, సుమ ఒక టీం అయినా కూడా కళ్యాణ్ కి అన్యాయం చేస్తుంది దివ్య. ఐతే తన టీం లో వాళ్లని తీయకుండా మిగతా వారిని తీస్తే డౌట్ వస్తుంది. అందుకే దివ్య తెలివిగా చేసింది. కానీ దివ్యని నమ్మి కళ్యాణ్ మోసపోయాడు.
ఇక మరోపక్క బ్లూ, పింక్, ఆరెంజ్ టెం లుగా కంటెస్టెంట్స్ ని విడగొట్టి టాస్క్ పెట్టారు. ఐతే ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయెల్, రాము విన్ అయ్యారు. గెలిచిన టీం లో ఒకరికి గ్రీన్ కార్డ్ వస్తుంది. దాంతో ఆరెంజ్ టీం నుంచి ఇమ్మాన్యుయెల్ కి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో హౌస్ లో ఈసారి కెప్టెన్సీ టాస్క్ కోసం ఎవరి పంథా వారు కొనసాగుతొ.. ఎవరి దారి వారు చూసుకుటున్నారు.
