బిగ్‌బాస్‌లో నెపో కిడ్స్ అరాచకం.. హోస్ట్ కళ్లు తెరవాలి
ఇండియాలో బిగ్‌బాస్ రియాల్టీ షో కి ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Ramesh Palla | 22 Sept 2025 2:00 PM ISTఇండియాలో బిగ్‌బాస్ రియాల్టీ షో కి ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చూసినా బిగ్‌బాస్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్న వారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం సౌత్ లో ముఖ్యంగా తెలుగు బిగ్‌బాస్ సాగుతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో హిందీలో బిగ్‌బాస్ సీజన్ 19 నడుస్తోంది. గత సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్‌కి హోస్ట్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడూ సల్మాన్ ఖాన్ పై ఏదో ఒక తరహాలో విమర్శలు వస్తూనే ఉంటాయి. ఫలానా కంటెస్టెంట్ విషయంలో సల్మాన్ పాజిటివ్‌గా ఉంటున్నాడు. ఆయన తప్పు చేసినా మందలించడం లేదు, వేరే వాళ్లు చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్షలు వేస్తున్నాడు అని సల్మాన్ ఖాన్ గురించి పదే పదే వినిపించే విమర్శలు ఇవి. అవే ఈసారి కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి నెపొటిజం అనేది ప్రముఖంగా వినిపిస్తోంది.
బిగ్‌బాస్ షో లో నెపో కిడ్స్ గొడవ
బిగ్‌బాస్ షో లో ఉన్న కొందరు నెపోకిడ్స్ డామినేషన్ చేస్తున్నారు. వారు తాము పెద్ద సెలబ్రిటీలం అన్నట్లుగా ఫీల్ అవుతూ టీవీ సీరియల్స్‌లో నటించే వారిని, కొందరు సోషల్ మీడియా సెలబ్రిటీలను అవమానిస్తూ మాట్లాడుతున్నారు. తాము చెప్పినట్లుగా వినాల్సిందే అన్నట్లుగా వారు రూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లు ఏం చేసినా కూడా సల్మాన్ ఖాన్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య అమల్ చేసిన ఒక ఫ్రాంక్ వివాదాస్పదం అయినా కూడా సల్మాన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ వారం ఖచ్చితంగా అమల్ ను చాలా సీరియస్‌గా సల్మాన్ ఖాన్ తిడుతాడు అని అనుకున్న వారికి షాక్ ఇచ్చిన సల్మాన్ మరోసారి అదే తీరును కనబర్చాడు. సల్మాన్ ఇతరుల పట్ల ఉన్నట్లుగా ఆ నెపో కిడ్స్ విషయంలో ఉండటం లేదు అనేది మరింత బలంగా వినిపిస్తోంది.
గౌరవ్ ఖన్నా, బసీర్ అలీ గొడవ
ఇటీవల ఒక ఎపిసోడ్‌లో గౌరవ్ ఖన్నా, బసీర్ అలీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఆ వివాదంలో అమల్ జోక్యం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఇద్దరిని సముదాయించాల్సి ఉంటుంది. కానీ అమల్ గొడవను మరింతగా సీరియస్ అయ్యేలా గౌరవ్ పట్ల అసభ్యకరంగా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్‌ను గతంలో తాను ఒక సీరియల్‌లో చేసిన నటనను విమర్శిస్తూ అమల్ కామెంట్స్ చేయడంతో వివాదం మరింత సీరియస్ అయింది. అంతే కాకుండా గౌరవ్ ను ఫట్టు అని కూడా అమల్ పిలిచాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే అర్హత లేదని, వెంటనే బయటకు వెళ్లి పోవాలంటూ అమల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చేసే అర్హత తనకు లేదనే విషయం ఆయన మరిచి పోయినట్లు ఉన్నాడు అంటూ నెటిజన్స్, బిగ్‌బాస్ ప్రేక్షకులు తీవ్రంగా మండి పడుతున్నారు.
బిగ్‌బాస్‌లో అమల్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి వారిని సల్మాన్ ఖాన్ ఎందుకు మందలించడం లేదు అన్నాడు. గౌరవ్ వెనుక కూడా అమల్, బసీర్ లు జాత్యాహంకారా వ్యాఖ్యలు సైతం చేయడంను చూపించారు. ఇంట్లో వాతావరణం వీరి వల్ల చాలా దెబ్బతింటుంది. అయినా కూడా సల్మాన్ ఖాన్ కళ్లు తెరిచి చూడటం లేదు అంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరో వైపు వారికి మద్దతు ఇచ్చే వారు సమర్ధిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఈసారి వ్యవహారం కాస్త సీరియస్‌గా మారడంతో షో కి రేటింగ్ సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది విశ్లేషకుల మాట. రేటింగ్ విషయం పక్కన పెడితే సల్మాన్ ఖాన్ తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. తప్పు చేసిన వారు ఎవరు అయినా ఖచ్చితంగా హోస్ట్ స్థానంలో ఉన్న సల్మాన్ స్పందించాల్సిందే అంటూ ప్రేక్షకులు, బిగ్‌బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
