Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఎలిమినేషన్ రిస్క్ ఎవరికి..?

బిగ్ బాస్ సీజన్ 9 లో ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో హరీష్, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, భరణి, మనీష్, డీమాన్ పవన్, ప్రియా శెట్టిలు ఉన్నారు.

By:  Ramesh Boddu   |   17 Sept 2025 10:19 AM IST
బిగ్ బాస్ 9.. ఎలిమినేషన్ రిస్క్ ఎవరికి..?
X

బిగ్ బాస్ సీజన్ 9 లో సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగింది. ఈసారి నామినేషన్స్ ఓనర్స్, టెనంట్స్ అందరిలో తమకు నచ్చని.. హౌస్ నుంచి వెళ్లిపోవాలి అనుకునే ఇద్దరి మీద రంగు రాయాలి. ఈ నామినేషన్స్ లో హరీష్ రీతు చౌదరి, ఇమ్మాన్యుయెల్, భరణి, సుమన్ శెట్టి ఇలా అందరు తమ పాయింట్స్ పెట్టాఅరు. హరీష్ వర్సెస్ ఇమ్మాన్యుయెల్, హరీష్ వర్సెస్ భరణి నామినేషన్స్ ప్రక్రియ పెద్ద రభసలానే జరిగింది.

ఈ వారం నామినేషన్స్ లో..

బిగ్ బాస్ సీజన్ 9 లో ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో హరీష్, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, భరణి, మనీష్, డీమాన్ పవన్, ప్రియా శెట్టిలు ఉన్నారు. ఐతే లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేని భరణి, ప్రియా శెట్టి, మనీష్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో రెండో వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో రిస్క్ ఎవరికి అన్నది చూస్తే అది కచ్చితంగా ఫ్లోరా షైనీకే అని చెప్పొచ్చు. ఆమె తర్వాత డీమాన్ పవన్ కూడా రిస్క్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది.

ఆల్రెడీ ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఓనర్స్ నుంచి కేవలం డీమాన్ పవన్ ఒక్కడే ఉన్నాడు. అతను దాదాపు చివరి దాకా వచ్చి సేవ్ అయ్యాడు. ఐతే ఈసారి ఓనర్స్, టెనంట్స్ నుంచి నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే ఆల్రెడీ అగ్నిపరీక్ష ద్వారా ప్రియా, మనీష్ లకు కొంత ఫాలోయింగ్ ఉంది. డీమాన్ పవన్ ఈ మూడు రోజులు ఆట ఆడిన దాన్ని బట్టి అతను సేఫ్ అవుతాడా లేదా అన్నది తెలుస్తుంది.

రెండో వారం డేంజర్ జోన్ లో..

ఇక ఫ్లోరా షైనీ అయితే ఆమె దాదాపు గివ్ అప్ ఇచ్చేసినట్టే ఉంది. రెండో వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు బాగా ఉన్నాయి. ఫ్లోరా కాకపోతే డీమాన్ పవన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈ ఇద్దరిలో తప్ప మిగతా ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సుమన్ శెట్టికి ఆల్రెడీ బయట బాగానే ఫాలోయింగ్ ఏర్పడింది. అతని మీద బిగ్ బాస్ ఆడియన్స్ జాలి చూపిస్తున్నారు.

ఇక భరణి ఎలాగు స్ట్రాంగ్ పర్సనే కాబట్టి అతను వెళ్లే ఛాన్స్ లేదు. సో భరణి, మనీష్, ప్రియ, సుమన్ శెట్టి, హరీష్, ఫ్లోరా షైనీ, డీమాన్ పవన్ లలో ఈ వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు.. ఐతే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ లవర్ అని అంటూ హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా వచ్చాడు. అతను హౌస్ లో జరిగే ప్రతి విషయాన్ని చాలా పెద్ద సీన్ చేస్తున్నాడు.

దాదాపు హౌస్ లో 3 రోజులుగా ఏమి తినలేదు.. నేను బయటకు వెళ్తా అంటున్నాడు. సో ఓటింగ్ లైన్ లో అతను లీస్ట్ లో అంటే చివరన ఉండే ఛాన్స్ లేకపోయినా లీస్ట్ 2 లో ఉన్నా అతన్నే ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలా అయితే ఫ్లోరా, డీమాన్ పవన్ ఇద్దరు సేవ్ అవుతారు.