Begin typing your search above and press return to search.

ముకేశ్ తో వర్షిణి ఎందుకు క్లోజ్గా ఉంటుందో తెలుసా?

వర్షిణి తన బాధను, వ్యక్తిగత విషయాలను త్రిగుణ్‌తో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది. చిన్నతనం నుంచి తాను అమ్మతోనే ఉన్నానని, తనకు తండ్రి ప్రేమ లభించలేదని చెప్పింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   8 Oct 2026 9:10 AM IST
ముకేశ్ తో వర్షిణి ఎందుకు క్లోజ్గా ఉంటుందో తెలుసా?
X

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో వర్షిణి గేమ్ పేలవంగా ఉంది. సెలెబ్రిటీస్ అందరిలో వర్షిణి గేమ్ ఒక్కటే ఇప్పటి దాకా ఆశాజనకంగా లేదు. అయితే ఆమె ముకేశ్ తో సున్నితంగా ఉంటుందని ఇప్పటికే కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో అసలు వారిరువురు ఎందుకు అంత క్లోజ్ గా ఉన్నారనే విషయం మీద ఆమె క్లారిటీ ఇచ్చింది.

వర్షిణి తన బాధను, వ్యక్తిగత విషయాలను త్రిగుణ్‌తో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది. చిన్నతనం నుంచి తాను అమ్మతోనే ఉన్నానని, తనకు తండ్రి ప్రేమ లభించలేదని చెప్పింది. తండ్రి చేయి పట్టుకునే అదృష్టం కూడా తనకు దక్కలేదని, చిన్నప్పటి నుంచి ఆ భావన తనలో అణచి పెట్టుకున్న అగ్నిపర్వతంలా ఉందని తెలిపింది. బిగ్ బాస్ షో కి వచ్చినప్పటి నుంచి ఆ బాధ ఇంకా ఎక్కువైందనే విషయం ఆమె స్పష్టం చేసింది.

ఈ విషయం త్రిగుణ్ కి చెప్తూ, అందుకే తాను ముఖేష్‌కు దగ్గరయ్యానని, ముఖేష్ చేయి పట్టుకున్నప్పుడు తనలో ఉన్న భయాలన్నీ తొలగిపోయినట్లు ఒక అనుభూతి కలుగుతుందని వివరించింది. తాను ఏది చెప్పినా ముఖేష్ ఓపికగా వింటాడని, అందుకే ఆయనతో సాన్నిహిత్యం పెరిగిందని, బయట వాళ్లకు అది లవ్ ట్రాక్‌లా కనిపించవచ్చని స్పష్టం చేసింది.

మరోవైపు దేబ్జానీ, వంశీలు అపూర్వ గురించి మాట్లాడుకున్నారు. అపూర్వ వాదించే విధానాన్ని, ఆమె బాడీ లాంగ్వేజ్‌ను దేబ్జానీ ఇమిటేట్ చేస్తూ సెటైర్లు వేసింది. దీనిపై వంశీ స్పందిస్తూ, హౌస్‌లో అందరిపై చిరాకు తెప్పించేలా ప్రవర్తించేవారు ఎవరైనా ఒకరు ఉండాలని, అందుకే ప్రతి సీజన్‌లోనూ బిగ్‌బాస్ ఇలాంటి వాళ్లను పంపిస్తుంటారని అభిప్రాయపడ్డాడు.

ఇక డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లను సేఫ్ జోన్‌లోకి తీసుకు వచ్చేందుకు బిగ్‌బాస్ ఒక కొత్త టాస్క్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా డేంజర్ జోన్‌లోని సభ్యులు జంటలుగా విడిపోవాలని సూచించారు. అందులో భాగముగా ఇచ్చిన టాస్క్లో చరణ్ - అపూర్వ ఈ టాస్క్‌ను అందరికంటే ముందుగా పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచారు.

అయితే అందరినీ షాక్ కి గురి చేస్తూ, రోహిత్ షాలిని లు ఈ టాస్క్ లో ఆఖరి స్థానం లో నిలవడం విస్మయానికి గురి చేసింది. అయితే రోహిత్ గేమ్ డౌన్ అవడానికి ఇదే సూచిక అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.