Begin typing your search above and press return to search.

ఆమె వైల్డ్ కాదు వైల్డెస్ట్.. హోస్ట్ నే క్వశ్చన్ చేసింది..!

బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారు. సీజన్ 9లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఆట కచ్చితంగా మారబోతుందని అర్థమవుతుంది.

By:  Ramesh Boddu   |   12 Oct 2025 6:06 PM IST
ఆమె వైల్డ్ కాదు వైల్డెస్ట్.. హోస్ట్ నే క్వశ్చన్ చేసింది..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారు. సీజన్ 9లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఆట కచ్చితంగా మారబోతుందని అర్థమవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆరుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఐతే అందులో ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయితే నిజంగానే చాలా వైల్డెస్ట్ అని తెలుస్తుంది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐషా, నిఖిల్, రమ్య, దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్త ఎంట్రీ ఇస్తున్నారు.

తమిళ బిగ్ బాస్ లో ఐషా..

ఐతే ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ గా వస్తున్న ఐషా ఆల్రెడీ సీరియల్స్ లో పాపులారిటీ సంపాదించారు. అంతేకాదు తమిళ బిగ్ బాస్ లో ఆమె ఆల్రెడీ పాల్గొన్నారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లో ఆమె 9 వ వారం దాకా హౌస్ లో ఉన్నారు. ఐతే ఐషా చాలా డేరింగ్ పర్సన్.. హోస్ట్ ని కూడా ఎదురు ప్రశ్నలు అడుగుతుందట. సీజన్ 6 తమిళ్ లో ఒకసారి కమల్ హాసన్ మీదే ఆమె అలిగేషన్స్ వేసిందట. మీరు కావాలనే రాంగ్ గ్రా పోట్రే చేస్తున్నారని అనేసిందట.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో అలాంటి ఒక రెబల్ క్యాండిడేట్ వైల్డ్ కార్డ్ గా వస్తుంది. మరి ఇక్కడ కూడా ఐషా అలాంటి దూకుడు చూపిస్తుందా అన్నది చూడాలి. ఐషా ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కు సీరియల్స్ ద్వారా పరిచయమైంది. కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ లో ఆమె పాల్గొన్నది. సో తెలుగు ఆడియన్స్ ప్రేమను మరింత సంపాధించాలనే కోరికతో ఆమె తెలుగు సీజన్ 9 బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది. మరి అమ్మడు ఇక్కడ ఎలా తన ఆటతో ఆకట్టుకుంటుందో చూడాలి.

సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్స్ ప్రోమోస్..

ఇక బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్స్ ప్రోమోస్ ఆల్రెడీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఇతర భాషల హోస్ట్ లు కూడా బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫైర్ స్టోర్మ్ గురించి చెప్పడం సంథింగ్ స్పెషల్ గా ఉంది. తప్పకుండా ఈ సీజన్ ని మేకర్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్పకనే చెబుతున్నారు.

ఈ వారం డబల్ ఎలిమినేషన్స్ లో భాగంగా హౌస్ లో నుంచి ఆల్రెడీ ఫ్లోరా షైనీని ఓటింగ్ ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ చేశారని తెలుస్తుంది. ఐతే వైల్డ్ కార్డ్స్ ద్వారా హౌస్ లో మరో ఎలిమినేషన్ ఉంటుందట. వైల్డ్ కార్డ్స్ అంతా కలిసి శ్రీజని ఈరోజు ఎలిమినేట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.