బిగ్ బాస్ 9.. ఎలిమినేషన్ ట్విస్ట్ ఉంటుందా..?
బిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారం ఎలిమినేషన్ ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సండే రోజు హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తిగా మారింది.
By: Ramesh Boddu | 4 Oct 2025 10:28 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారం ఎలిమినేషన్ ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సండే రోజు హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ సీజన్ లో జరిగిన 3 వారాల్లో 3 ఎలిమినేషన్స్ కాస్త కూస్తో గెస్ చేసేలా ఉన్నాయి. కానీ ఈ వారం మాత్రం కాస్త టఫ్ గానే ఉంది. ఈ వీక్ నామినేషన్స్ లో కామనర్స్ నుంచి 3, సెలబ్రిటీస్ నుంచి మరో ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో హరీష్, దివ్య, శ్రీజ, ఫ్లోరా షైనీ, సంజన, రీతు చౌదరి ఉన్నారు.
సీజన్ 9 ఎలిమినేషన్ ఎవరన్నది..
ఐతే సీజన్ 9లో ప్రతి వారం ఎలిమినేషన్ ఎవరన్నది రెండు రోజుల ముందే అంటే ఓటింగ్ లో ఎవరు లీస్ట్ ఉన్నారన్నది తెలుస్తుంది. కానీ ఈసారి హౌస్ లో అందరి పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అలా చెప్పడం కష్టంగా ఉంది. ఐతే తెలుస్తున్న సమాచారం వరకు శ్రీజనే డేంజర్ జోన్ లో ఉందని టాక్. ఐతే హరీష్ కూడా హౌస్ లో సరిగా ఆడలేకపోతున్నాడు. మిగతా హౌస్ మెట్స్ అంతా ఒక వైపు తను ఒక్కడే మరో వైపు అనేలా ఉన్నాడు. ఈ వారం హెల్త్ సహకరించలేదని కొన్ని టాస్కులు పక్కన ఉన్నాడు.
ఇదంతా హరీష్ కి అసలు హౌస్ లో ఉండాలని లేదా అన్న అనుమానం కలిగేలా చేస్తుంది. రెండో వారం ఆయనే హౌస్ లో నుంచి వెళ్లిపోతా అంటూ చెప్పాడు. హరీష్ బిగ్ బాస్ కి రావాలని అనుకుని అగ్నిపరీక్ష ద్వారా వచ్చాడు. కానీ హౌస్ లో ఎందుకో అందరితో మిగిల్ అవ్వలేకపోతున్నాడు. ఇక ఫ్లోరా షైనీ కూడా డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఆమె ఆట సరిగా ఆడట్లేదు ఇంకా భాషా పరమైన సమస్య కూడా ఉంది.
రీతు చౌదరి కూడా రిస్క్..
రీతు చౌదరి కూడా నెక్స్ట్ రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఉందనిపిస్తుంది. డీమాన్ పవన్ తో కలిసి రీతు ఆడుతున్న ఆట ఆమెకు నెగిటివిటీ ఏర్పడేలా చేస్తుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సంజన సేఫ్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఆమె కన్నా చాలా వీక్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఆమె తప్పకుండా కొనసాగే ఛాన్స్ ఉంటుంది.
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది కొద్ది గంటల్లో తెలుస్తుంది. శని ఆదివారాలకు సంబందించిన షూట్ ఈరోజు జరుగుతుంది. సో ఆదివారం షూట్ ఈరోజు సాయంత్రం మొదలు పెడతారు. ఆ టైంలోనే ఈరోజు ఈవెనింగ్ కల్లా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది లీక్ అవుతుంది.
