Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఓనర్స్ వర్సెస్ టెనంట్స్.. అసలేం జరుగుతుంది రాజా..?

బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్, కామనర్స్ అంటూ ఏదో మెలిక పెట్టి కామనర్స్ ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి హౌస్ లోకి తెచ్చాడు.

By:  Ramesh Boddu   |   11 Sept 2025 10:14 AM IST
బిగ్ బాస్ 9.. ఓనర్స్ వర్సెస్ టెనంట్స్.. అసలేం జరుగుతుంది రాజా..?
X

బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్, కామనర్స్ అంటూ ఏదో మెలిక పెట్టి కామనర్స్ ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి హౌస్ లోకి తెచ్చాడు. ఐతే షోకి రాకముందే అగ్నిపరీక్ష ఎదుర్కొన్నారు కాబట్టి బిగ్ బాస్ హౌస్ కి వాళ్లని ఓనర్స్ గా సెలబ్రిటీస్ ని టెనంట్స్ గా చేశారు. టెనంట్స్ మాత్రమే ఇంటి డ్యూటీస్ చేయాలి. ఉతకడం, క్లీనింగ్, కుకింగ్ అన్నీ వాళ్లవే. వాళ్లని అలా చేయించడమే కామనర్స్ అదే ఓనర్స్ పని అవుతుంది.

ప్రతిదాన్ని ఇష్యూ చేస్తూ..

ఐతే సెలబ్రిటీస్, కామనర్స్ అన్నది పక్కన పెడితే.. ఆటని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఫన్ లేకుండా చేస్తున్నారు కామనర్స్. బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇస్తే దాన్ని సీరియస్ గా అటెంప్ట్ చేయాలి. కానీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. ప్రతిదాన్ని ఇష్యూ చేస్తూ చిరాకు తప్పించకూడదు. టెనంట్స్ లో అదే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో సంజన గర్లాని కేవలం ఆమె కంటెంట్ కోసమే గొడవలు సృష్టిస్తుంది. ఆ విషయాన్ని అందరు కనిపెట్టారు కూడా.

ఓనర్స్ గా ఉన్న కామనర్స్ కూడా ఆటని ఎలాంటి ఫన్ లేకుండా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. హరీష్ ఐతే తను చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మనీష్ కూడా తన కామ్ నెస్ కోల్పోతున్నాడు. ప్రియ, శ్రీజ ఆల్రెడీ టెనంట్స్ మీద డిజప్పాయింట్ గా ఉన్నారు. ఎటొచ్చి డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల కాస్త బ్యాలెన్స్ గా కనిపిస్తున్నారు.

భరణి ఒక్కడే అటు ఇటు బ్యాలెన్స్..

ఇటు టెనంట్స్ లో కూడా భరణి ఒక్కడే అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాడు. శ్రష్టి వర్మ కూడా అలానే కనిపించింది. సుమన్ శెట్టి అసలు హౌస్ లో ఉన్నాడా లేదా అన్నట్టు ఉంది. తనూజా సీరియల్ స్టార్ కాబట్టి ఆమె ఊరకనే ఎమోషనల్ అవుతూ కంటెంట్ ఇస్తుంది. ఫ్లోరా షైనీ తన డ్యూటీస్ తను చేస్తుంది. సంజన అనవసరమైన హంగామా చేస్తుంది. ఇమ్మాన్యుయెల్ కామెడీ చేసినా సీరియస్ అవుతున్నారని ఫీల్ అవుతున్నాడు. రీతూ చౌదరి ఇప్పటివరకు అయితే గట్టి పాయింట్ అయితే ఇవ్వలేదు. రాము రాథోడ్ కూడా ఇంపాక్ట్ చూపించట్లేదు.

ఫైనల్ గా ఈ సీజన్ మొదలైన 3 రోజులకే బోర్ కొట్టించేస్తున్నారు. కంటెంట్ ఇవ్వడం అంటే గొడవలు పడటం చిన్న దాన్ని పెద్ద ఇష్యూ చేయడం కాదు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అన్న విషయాన్ని ఈ సీజన్ కంటెస్టెంట్స్ మర్చిపోయినట్టు ఉన్నారు. మరి ఈ వారం నాగార్జున వీళ్లకి ఎలాంటి క్లాస్ ఇస్తారన్నది చూడాలి.