బిగ్ బాస్ 9.. సెలబ్రిటీస్ కి మొదలైన అగ్నిపరీక్ష..!
ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సెలబ్రిటీస్ కి నాగార్జున షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ 9లో రెండు హౌస్ లు ఉన్నాయి.
By: Ramesh Boddu | 8 Sept 2025 9:46 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం మొదలైంది. స్టార్ మా లో రాత్రి 7 గంటల నుంచి షో గ్రాండ్ లాంచ్ అయ్యింది. సీజన్ 9 కోసం సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అంటూ కాన్సెప్ట్ రెడీ చేశారు. అంతేకాదు రెండు హౌస్ లు కూడా ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన ఆరుగురిని హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ సీజన్ 9 లో 9 మంది సెలబ్రిటీస్, ఆరుగురు కామన్ మ్యాన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ 9లో రెండు హౌస్లు..
ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సెలబ్రిటీస్ కి నాగార్జున షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ 9లో రెండు హౌస్ లు ఉన్నాయి. ఒకటి బిగ్ బాస్ హౌస్ కాగా మరొకటి అవుట్ హౌజ్. అంటే బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఒకటి ఓనర్స్ ది.. రెండోది టెనంట్స్ ది అన్నమాట. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎదుర్కొని హౌస్ లోకి వచ్చిన కామన్ మ్యాన్ ని బిగ్ బాస్ ఓనర్స్ గా పరిగణలోకి తీసుకున్నాడు. సెలబ్రిటీస్ ని టెనంట్స్ గా అవుట్ హౌస్ లో ఉంటారు.
అంగరంగ వైభవంగా జరిగిన బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ లో సెలబ్రిటీస్ ఇద్దరిని పంపించిన తర్వాత ఒక కామన్ మ్యాన్ ని హౌస్ లోకి పంపించారు. ముందు ఐదుగురు మాత్రమే కామన్ మ్యాన్ అని చెప్పి చివరగా శ్రీముఖి వచ్చి మరొకరిని కూడా పంపించాలని డిసైడ్ చేశారు. అలా బిగ్ బాస్ సీజన్ 9 లో ముందు పవన్ కళ్యాణ్ తర్వాత హరీష్, డీమన్ పవన్, శ్రీజన్, ప్రియా శెట్టి వెళ్లగా ఫైనల్ గా మనీష్ ని కూడా హౌస్ లోకి పంపించారు.
వారం మొత్తం హౌస్ డ్యూటీస్..
ఇక సెలబ్రిటీ కేటగిరిలో తనూజ, ఫ్లోరా శైనీ, రాము రాథొడ్, ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, భరణి శంకర్, శ్రేష్టి వర్మ, సంజన గర్లాని హౌస్ లోకి వచ్చారు. సెలబ్రిటీస్ ఇద్దరు రాగానే ఒక కాం మ్యాన్ ని పంపించి సెలబ్రిటీస్ కి ఒక హౌస్ డ్యూటీని ఇప్పించారు. వారం మొత్తం హౌస్ డ్యూటీస్ ని బిగ్ బాస్ సీజన్ 9 లో వచ్చిన సెలబ్రిటీస్ కి అప్పగించారు. బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీస్ అంత స్టఫ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరన్నది అంతగా తెలియట్లేదు.
ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కామన్ మ్యాన్ ఆరుగురు మాత్రం ఆడియన్స్ లో ఒక ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పరచుకున్నారు. ఐతే ఈ సీజన్ విన్నర్ కూడా కామన్ మ్యాన్ లో ఒకరు అవుతారంటూ అప్పుడే అంచనాలు మొదలు పెట్టేస్తున్నారు.
