బిగ్ బాస్: ప్రైజ్ మనీతో పాటూ బోలెడు బహుమతులు.. విన్నర్ ఎవరంటే?
టాప్ 5లో ఉన్న ఆ ఐదుగురు విషయానికి వస్తే.. ఇమ్మాన్యూయేల్, సంజన, తనూజ , కళ్యాణ్ , పవన్ హౌస్ లో ఉన్నారు.
By: Madhu Reddy | 20 Dec 2025 7:21 PM ISTవరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పాపులారిటీ సొంతం చేసుకుంది బిగ్ బాస్ షో. ఇప్పటికే హిందీలో 19 సీజన్లు పూర్తి కాగా, ఇటు తెలుగులో కూడా 9వ సీజన్ పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు.? ట్రోఫీతో పాటు వీరికి వచ్చే ప్రైజ్ మనీ ఎంత? అలాగే ప్రైజ్ మనీతో పాటు లభించే బహుమతులు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అభిమానుల అంచనాల ప్రకారం ఈసారి విజేతగా ఎవరు నిలవబోతున్నారు? విజేతగా నిలిచిన వారికి ఎలాంటి బహుమతులు లభించనున్నాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఏకంగా 6 మంది కామన్ క్యాటగిరీలో హౌస్ లోకి వచ్చారు. అయితే ఈ 6 మంది కూడా అగ్నిపరీక్ష అనే మినీ షోలో జడ్జెస్ పెట్టే పలు రకాల టాస్కులను పూర్తి చేసి మరీ నెగ్గి హౌస్ లోకి వచ్చారు. ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరో కామన్ మ్యాన్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. మరో ఆరు మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ తో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులతో ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం టాప్ 5 మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇక రేపు విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.
టాప్ 5లో ఉన్న ఆ ఐదుగురు విషయానికి వస్తే.. ఇమ్మాన్యూయేల్, సంజన, తనూజ , కళ్యాణ్ , పవన్ హౌస్ లో ఉన్నారు. ఈ టాప్ ఫైవ్ నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసి ఫైనల్ గా ఇద్దరిని ఉంచి వారిలో ఒకరిని మాత్రమే విన్నర్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ టాప్ ఫైవ్ లో బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారా ? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. కానీ మొదటి నుంచి టైటిల్ విన్నర్ రేస్ తనూజ - కళ్యాణ్ ల మధ్యనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇక వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈసారి బిగ్ బాస్ కప్ అందుకోబోతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వారికి కాసుల వర్షం కురవనుంది అని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కి రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుతుందని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్ కూడా ఉంటుంది.. అంటే ఈ రెండు కలిపి విన్నర్ కి భారీ మొత్తము అందుతుందని చెప్పవచ్చు.
ఈ రెండు తోపాటు స్పాన్సర్స్ కంపెనీల నుంచి అదనపు బహుమతులు లభిస్తాయి. బంగారు ఆభరణాలు, ఫ్లాట్ , కారు వంటి వాటిని కానుకలుగా ఇస్తారు. ఇకపోతే గత సీజన్ విజేతలకు కూడా ఇలాంటి స్పాన్సర్స్ నుంచీ బహుమతులు భారీగా లభించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు గెలిచినా వారికి మొత్తం భారీగా ఇవన్నీ లభిస్తాయని చెప్పవచ్చు. మరి విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
