బిగ్ బాస్ 9.. టార్గెట్ చేసి మరీ టాప్ 5కి పంపించేస్తున్నారుగా..?
ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ వచ్చి ఫైర్ స్టోర్మ్ అంటూ కొత్త జోష్ తెచ్చారు. ఐతే వీరిలో కొందరు ఆల్రెడీ హౌస్ లో మొదటి నుంచి ఉన్న పాత కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారు.
By: Ramesh Boddu | 22 Oct 2025 11:28 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ప్రస్తుతం ఏడవ వారం ఆట కొనసాగుతుంది. ఇప్పటికే హౌస్ లో స్ట్రాంగ్ ఎవరు వీక్ ఎవరు వెనక పడుతుంది ఎవరు.. టాప్ 5కి దూసుకెళ్తుంది ఎవరు అన్నది లెక్క మొదలైంది. కొంతమంది ఎక్స్ పెక్ట్ చేసిన దానికి రీచ్ కాలేక వెనుకబడి ఉంటే కొంతమంది మాత్రం ఊహించిన దాని కన్నా ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ వచ్చి ఫైర్ స్టోర్మ్ అంటూ కొత్త జోష్ తెచ్చారు. ఐతే వీరిలో కొందరు ఆల్రెడీ హౌస్ లో మొదటి నుంచి ఉన్న పాత కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారు.
రమ్య మోక్ష, తనూజ మధ్య గొడవ..
ఐతే అది వారి ఆట గ్రాఫ్ ని కిందకు లాగుతుందని వీరు భావిస్తున్నారు కానీ దానికి రివర్స్ లో వారి గ్రాఫ్ మరింత పెరుగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో రమ్య మోక్ష, తనూజ మధ్య డిస్కషన్ తెలిసిందే. అది డిస్కషన్ అనడం కన్నా గొడవ పడటం అంటే కరెక్ట్ అని చెప్పొచ్చు. రమ్య ఫేక్ పిల్లా అంటూ తనూజ మీద రెచ్చిపోయింది. ఐతే ఆమె చేస్తున్న బ్యాక్ బిచ్చింగ్ గురించి కూడా తనూజ రివర్స్ లో అదే రేంజ్ లో ఇచ్చింది.
మరోపక్క ఇమ్మాన్యుయెల్ కూడా తనూజ విషయంలో చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. నామినేషన్స్ టైం లో కళ్యాణ్ కి నామినేషన్ టోకెన్ ఇస్తూ తనూజని నామినేట్ చేస్తానంటేనే ఇచ్చాడు. కళ్యాణ్ సంజనని చేసేసరికి ఇమ్మాన్యుయెల్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యాడు. మరోపక్క సంజన కూడా కళ్యాణ్ తనని నామినేట్ చేశాడని తనూజని అడ్డు పెట్టుకుని అతని మీద కామెంట్స్ చేస్తుంది. అంతేకాదు సంజన నిఖిల్ హౌస్ లోకి వచ్చే సరికి కళ్యాణ్ ని పక్కన పెట్టిందని కూడా సంజన అన్నది.
నామినేషన్స్ లో ఆమె టాప్ ప్లేస్ లో ఓటింగ్..
ఈ విషయంపై తనూజ సంజకి క్లాస్ పీకింది. మొత్తానికి హౌస్ లో అందరి సాఫ్ట్ టార్గెట్ తనూజ అవుతుంది. ఐతే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్లు తనూజని ఎంతలా టార్గెట్ చేస్తే ఆమె అంత ముందుకెళ్తుంది. ఆల్రెడీ నామినేషన్స్ లో ఆమె టాప్ ప్లేస్ లో ఓటింగ్ తెచ్చుకుంటుంది. ఇమ్మాన్యుయెల్ కూడా తనకు పోటీగా వస్తుందని తనూజని రాంగ్ గా పోట్రే చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. సో బిగ్ బాస్ సీజన్ 9 లో అందరి చేత టార్గెట్ అవుతూ తనూజ టాప్ 5 లో ఛాస్ దక్కించుకునేలా ఉంది. మరో 6, 7 వారాల ఆట ఉంది కాబట్టి ఈలోగా ఏదైనా మార్పులు వస్తాయేమో చూడాలి. ఐతే ఇదే రేంజ్ లో తనూజ ఆట ఉంటే మాత్రం ఆమె సీజన్ విన్నర్ అయినా అయ్యే ఛాన్స్ ఉంది.
