బిగ్‌బాస్9 : కంటెస్టెంట్స్‌కి షాక్.. ప్రేక్షకులు ఊహించిందే
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మెల్ల మెల్లగా ప్రేక్షకుల్లో మంచి ఆధరణ దక్కించుకుంటూ దూసుకు పోతుంది.
By: Ramesh Palla | 26 Sept 2025 8:24 PM ISTతెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మెల్ల మెల్లగా ప్రేక్షకుల్లో మంచి ఆధరణ దక్కించుకుంటూ దూసుకు పోతుంది. ఇప్పటికే కొందరు ఎలిమినేట్ కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నాయి. ఇదే సమయంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ముందు నుంచే ప్రచారం జరుగుతున్నట్లుగా బిగ్‌బాస్ టీం మధ్య రాత్రి ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఇతర సభ్యులు ఏకాభిప్రాయంకు వచ్చి ఒకరి పేరును చెప్పాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత షో లో సంజనాకి ఉండే అర్హత లేదు అన్నట్లుగా ఆమెను బయటకు పంపించాలని నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా ఆమె తీరును గురించి ఒకొక్కరు వివరిస్తూ ఆమె ఎలిమినేషన్‌కి తమ కారణాలను చెప్పడంతో సంజనా ఇంట్లోంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది.
బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లాన్
సాధారణంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే చాలా మంది సీక్రెట్ రూం అని ఊహించేస్తారు. ఈ సీజన్‌లో కూడా సంజనా ను మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి వెంటనే సీక్రెట్ రూంకి తరలించారు. బిగ్‌బాస్ తీసుకున్న ఈ నిర్ణయం కంటెస్టెంట్స్‌కి షాకింగ్‌గా ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం పెద్దగా షాక్ అవ్వలేదు. హౌస్‌ను దొంగల హౌస్‌గా ఉంచడం మాకు నచ్చడం లేదు అంటూ హరీష్ చెప్పి సంజనా ను బయటకు పంపించాల్సిందే అంటూ చెప్పాడు. ఆ తర్వాత సంజనా ఎలిమినేషన్‌ను భరణి, రాము, డిమాన్ పవన్, పవన్ కళ్యాణ్ లు కోరుకున్నారు. దాంతో ఎక్కువ మంది సంజనాకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమె బయటకు రావాల్సి వచ్చింది. రకరకాల కారణాలు చెబుతూ ఆమెను బయటకు పంపించిన ఇంటి సభ్యులు ఆ తర్వాత తాపీగా చర్చించుకోవడం కనిపించింది.
సంజనా ఎలిమినేషన్ డ్రామా
సంజనా ఎలిమినేషన్ తర్వాత జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యూల్ చాలా ఫీల్ అయ్యాడు. ఆమె వెళ్లిన తర్వాత చాలా ఏడ్చాడు. ఆ విజువల్స్‌ను ప్రముఖంగా చూపించారు. సంజనా ఖచ్చితంగా సీక్రెట్ రూంకు వెళ్లి ఉంటుంది అని ఒకరు ఇద్దరు కంటెస్టెంట్స్ అనుకున్నప్పటికీ చాలా మంది మాత్రం ఆమె పూర్తిగా ఎలిమినేట్ అయ్యి ఉంటుందని అనుకున్నారు. వారం రోజుల సీక్రెట్ రూం తర్వాత సంజనా హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వారం తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా చాలా విషయాలు ఆమెకు అనుకూలంగా ఉండవచ్చు అని కొందరు అంటున్నారు. మొత్తానికి మొదటి వారంలోనే సంజనా ఎలిమినేట్ అవుతుందని అనుకున్న వారు ఇప్పటి వరకు కొనసాగడం, సీక్రెట్ రూంకి పంపించడం అనేది ఆమెకు కలిసి వచ్చే అవకాశం అంటూ రివ్యూవర్స్, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్‌బాస్ ఇంట్లోనే సంజనా
నేటి ఎపిసోడ్‌లో ఈ విషయాలన్నింటిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. లైవ్ చూసిన వారు ఇప్పటికే సంజనా సీక్రెట్ రూంకి వెళ్లిందని అంటున్నారు. ప్రోమోలో మాత్రం ఆమె ఇంటిని వదిలి పూర్తిగా వెళ్లి పోయింది అంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇవ్వాలని భావిస్తున్నాడు. అయితే కొన్ని మాత్రం ముందుగానే ప్రేక్షకులు ఊహించేవిగా ఉన్నాయి. కంటెస్టెంట్స్ మాత్రం సంజనా ఎలిమినేషన్‌ను నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో సంజనా ఎలిమినేషన్ గురించి చాలా మంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఇలాంటి సమయంలో ఆమెకు సీక్రెట్ రూం ఛాన్స్ రావడం వల్ల ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం అంటున్నారు.
