బిగ్ బాస్ లో కొత్త ట్విస్ట్.. కామన్ మ్యాన్ కు అగ్ని పరీక్షే
తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 సిద్ధం అవుతోంది.
By: M Prashanth | 10 Aug 2025 10:52 PM ISTతెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 సిద్ధం అవుతోంది. గత 8 సీజన్లుగా తెలుగిళ్లలో అత్యంత ఆదరణ దక్కించుకున్న షో గా ప్రసిద్ధ్ది చెందింది బిగ్ బాస్. ఇప్పుడు సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. అయితే ఈసారి కాస్త భిన్నంగా రానుంది. కొత్త రూల్స్, కొత్త ట్విస్ట్ లతో ఉండనుంది.
ఇప్పటివరకు బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ లు వేర్వేరు గదులు, హాలు, కిచెన్ తో సెటప్ డిఫరెంట్ గా చూశాం. గత 8 సీజన్లలో ఇదే విధంగా నడిచింది. కానీ, తాజా సీజన్ లో మాత్రం ఆట మారనుంది. తాజా సమాచారం ప్రకారం.. రానున్న సీజన్ లో రెండు హౌజ్ లు ఉంటాయని టాక్ వినిపిస్తుంది.
ఇటీవల విడుదలైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున అక్కినేని దీని గురించి హింట్ ఇచ్చారు. ఈసారి సీజన్ లో ట్విస్ట్ ఉంటుందని ప్రోమో చూస్తే అదే అనిపిస్తుంది. అలాగే తెలుగు ఆడియెన్స్ కు బిహ్ బాస్ ఈసారి డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందించనుంది. అలాగే ఈ సీజన్ ప్రారంభానికి ముందు అగ్ని పరీక్ష పేరతో ఓ ప్రీ షో నిర్వహించనున్నారు. ఇందులో గత 8 సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు, విన్నర్లు పాల్గొంటారు.
వాళ్లు ఈసారి హౌజ్ లోకి ఎంటర్ అయ్యే కామన్ పీపుల్స్ ను ఎంపిక చేస్తారు. వాళ్లు పెట్టిన టాస్క్ల లు కంప్లీట్ చేసే బెస్ట్ పర్ఫార్మర్ కు సీజన్ 9 బిగ్ బాస్ హౌజ్ లో ఎంటర్ అయ్యే ఛాన్స్ దక్కుకుంది. ఇలా ఆ కామన్ మ్యాన్ ను గత సీజన్ల కంటెస్టెంట్లు డిసైడ్ చేస్తారు. ఈ క్రమంలో ఆగ్ని పరీక్ష ప్రోగ్రామ్ కు గత కంటెస్టెంట్లు నవదీప్, సీజన్ 4 విన్నర్ అభిజిత్, ఓటీటీ విన్నర్ బింధు మాధవి జడ్జ్ లుగా రానున్నారని బజ్ నడుస్తోంది.
అలా తొలిసారి షో ప్రారంభానికి ముందు ఇలా కామన్ మ్యాన్ ను ఎన్నుకోవడం, అనేక రకాల ట్విస్టులతో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంగి. వచ్చే నెలలో ఈ షో షురూ అవ్వనుంది.
