బిగ్ బాస్ 9.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ హంగామా మరో రెండు రోజుల్లో మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 7 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అవుతుంది.
By: Ramesh Boddu | 5 Sept 2025 10:19 AM ISTబిగ్ బాస్ హంగామా మరో రెండు రోజుల్లో మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 7 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. హోస్ట్ నాగార్జున గ్రాండ్ గా ఈ సీజన్ ని లాన్ చేయబోతున్నారు. ఈ షోలో పాల్గొనేందుకు ఆల్రెడీ కామన్ మ్యాన్ కు అగ్నిపరీక్ష అంటూ కొన్ని టాస్కులు ఇచ్చారు. వారిలో నుంచి ఎవరు టాప్ 15 కి అదే బిగ్ బాస్ హౌస్ కి వెళ్తారన్నది తెలియాల్సి ఉంది.
ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్..
బిగ్ బాస్ సీజన్ 9 మరో రెండు రోజుల్లో మొదలవుతున్న ఈ టైం లో హౌస్ లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు ఇదే లిస్ట్ ఫైనల్ అని అంటున్నారు. ఒకరిద్దరు తప్ప ఇప్పుడు చెప్పే వారంతా కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొంటారని తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ గా ఈ సీజన్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈసారి సెలబ్రిటీ కేటగిరిలో ఒకప్పటి హీరోయిన్ ఆషా శైనీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆషా శైనీ తో పాటు కన్నడ హీరోయిన్ సంజన గర్లాని కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వస్తున్నారు. సీరియల్ యాక్టర్ తనూజ గౌడ, సీరియల్ యాక్టర్ భరణి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్, కమెడియన్ సుమన్ శెట్టి, ఫోక్ సింగర్ కం డ్యాన్సర్ రాము రాథోడ్, డ్యాన్సర్ కం కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ. వీళ్లంతా సెలబ్రిటీ కేటగిరిలో హౌస్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.
కొత్తగా అగ్నిపరీక్ష అంటూ..
బిగ్ బాస్ సీజన్ 9 కోసం కామన్ మ్యాన్ ఎంపిక కొత్తగా అగ్నిపరీక్ష అంటూ ఒక షో నడిపించి అందులోనుంచి ఎంపిక చేశారు. టాప్ 15 లో నుంచి ఐదుగురికి హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆ ఐదుగురు దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. జ్యూరీతో పాటు వారి ఓటింగ్ ప్రకారం హౌస్ లోకి వెళ్లేది ఎవరన్నది తెలుస్తుంది.
ఐతే బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కేటగిరిలో దమ్ము శ్రీజ, మనీష్, హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ వెళ్తారట. ఐతే డీమాన్ పవన్ ప్లేస్ లో నాగ ప్రశాంత్ అయినా వెళ్లొచ్చని టాక్. సో వాళ్లు 9 వీళ్లు ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ ఫైనల్ గా 15 మెంబర్స్ తో బిగ్ బాస్ సీజన్ 9 మొదలవుతుంది. షో ఈసారి స్టార్ట్ అవ్వకముందే సూపర్ హిట్ వైబ్ వచ్చింది. మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉంటుందో చూడాలి.
