బిగ్ బాస్ అగ్నిపరీక్షలో వాళ్లు కూడా..?
ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి జడ్జులుగా బిగ్ బాస్ ఇన్ని సీజన్లలో తమ మార్క్ చూపించిన కొందరిని తీసుకున్నారని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 12 Aug 2025 10:24 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. సీజన్ 9 కామన్ మ్యాన్ కేటగిరిలో ఎక్కువ మంది ఉండేలా చూస్తున్నారు. అందుకు తగిన సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది. బిగ్ బాస్ టీం సెలెక్ట్ అయిన 40 మందిలోంచి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 షో మొదలు పెట్టకముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ మరో షో స్టార్ట్ అవుతుంది. దీనిలో ఇచ్చిన టాస్క్ లు అన్నీ గెలిచి బిగ్ బాస్ కి ఎవరు వెళ్తారన్నది చూడాలి.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి జడ్జులుగా..
ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి జడ్జులుగా బిగ్ బాస్ ఇన్ని సీజన్లలో తమ మార్క్ చూపించిన కొందరిని తీసుకున్నారని తెలుస్తుంది. అందులో అభిజిత్, నవదీప్, గీతా మాధురి ఉన్నారని తెలుస్తుంది. నవదీప్ సీజన్ 1 లోనే వైల్డ్ కార్డ్ గా వచ్చి అలరించాడు. నెక్స్ట్ అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచాడు. గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2 లో రన్నరప్ గా నిలిచారు. ఈ ముగ్గురు బిగ్ బాస్ కి ఎవరు అర్హులు అనేది నిర్ణయించేందుకు భాగం అవుతున్నారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్షకు శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరిస్తారు. ఈ షో ఆగష్టు 22 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ రణరంగమే అంటూ నాగార్జున ప్రమోషన్స్ చేస్తున్నాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎలా ఉంటుంది. కామన్ మ్యాన్ ని కంటెస్టెంట్స్ గా ఎలా ఎంపిక చేస్తారు. నాగార్జున చెప్పిన టెనెట్స్ రూల్స్ ఏంటి.. ఇంతకీ అభిజిత్, నవదీప్, గీతా మాధురి ఎలా వారిని ఎంపిక చేస్తారు అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సంథింగ్ స్పెషల్..
ఏది ఏమైనా బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. ఈ సీజన్ సెలబ్రిటీస్ వర్సెస్ కంటెస్టెంట్స్ మధ్య మంచి ఫైట్ ఉండబోతుంది. కామన్ మ్యాన్ కి సపోర్ట్ గా కొందరు.. సెలబ్రిటీస్ కి సపోర్ట్ గా మరికొందరు ఉండే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ రెండో వారం మొదలవుతుందని తెలుస్తుంది. సీజన్ 9 విషయంలో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష తోనే షో మీద మరింత హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బిగ్ బాస్ సీజన్ 9 ముందు సీజన్ల కన్నా చాలా ప్రత్యేకంగా ఉండేలా ఉంది.
