Begin typing your search above and press return to search.

నేడే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..

ఇకపోతే హౌస్ లో వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నా.. బయట మాత్రం టైటిల్ విషయంలో వీరిద్దరి అభిమానుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.

By:  Madhu Reddy   |   21 Dec 2025 1:54 PM IST
నేడే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..
X

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఎట్టకేలకు తెలుగులో నేడు చివరి ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నేడు 9వ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 14 మంది సెలబ్రిటీలు , ఏడు మంది కామనర్స్ అలా మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. భిన్నభిన్నమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎవరికివారు తమదైన పర్ఫామెన్స్ తో ఎదుటి కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే నేడు ఘనంగా గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఇప్పటికే తనూజ , సంజన, పవన్, కళ్యాణ్, ఇమ్మానుయేల్ టాప్ - 5 లో నిలవగా నిన్న సంజన ఎలిమినేట్ అయింది.

ప్రస్తుతం తనూజ , కళ్యాణ్ టైటిల్ రేస్ లో నిలవగా.. అటు బిగ్ బాస్ ఇచ్చే రూ.40 లక్షల సూట్ కేస్ ఆఫర్ ను ఇమ్మానుయేల్ తీసుకొని బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలా 5 మంది నుండి సంజన, ఇమ్మానుయేల్ ఎలిమినేట్ అయితే మిగిలిన ముగ్గురు టాప్ 3 లోకి వస్తారు. అందులో కళ్యాణ్ - తనూజ మధ్య పోటీ ఏర్పడనుంది. ఎటువంటి అంచనాలు లేకుండా కామన్ మ్యాన్ క్యాటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రముఖ సోల్జర్ కళ్యాణ్ తనదైన టాస్కులతో ఆడియన్స్ ను మెప్పిస్తూ.. మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక తనూజ టైటిల్ విన్నర్ అంటూ మొదటి నుండీ వార్తలు రాగా.. ఇప్పుడు ఆమెకి పోటీగా దూసుకొచ్చేశారు కళ్యాణ్.

ఇకపోతే హౌస్ లో వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నా.. బయట మాత్రం టైటిల్ విషయంలో వీరిద్దరి అభిమానుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మరి ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇచ్చిన సరే గొడవలు తప్పవు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు బిగ్ బాస్ ముద్దుబిడ్డగా తనూజ అటు కామన్ మ్యాన్ గా కళ్యాణ్ ఇద్దరు కూడా టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మరి ఎవరు టైటిల్ విజేతగా నిలవనున్నారో తెలియాలి అంటే ఈరోజు జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇకపోతే ఈసారి విజేతగా నిలిచిన వారికి 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు.. మొదటి రోజు నుండి ఇప్పటివరకు హౌస్ లో ఉన్నందుకు వీరికి వచ్చే కంటెస్టెంట్ రెమ్యూనరేషన్ కూడా లభిస్తుంది. అలాగే బిగ్ బాస్ షో ని స్పాన్సర్ చేస్తున్న కంపెనీల నుంచి అదనంగా బహుమతులు లభిస్తాయి. అలాగే బంగారు ఆభరణాలు ఫ్లాట్ కారు వంటివి అదనపు కానుకలు అని చెప్పవచ్చు ఇకపోతే విజేతగా ఎవరు నిలిచినా సరే వారికి ఇవన్నీ లభిస్తాయి. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే వార్త గత రెండు రోజుల నుంచి జోరుగా వినిపిస్తోంది.

మొదట ది రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినిపించాయి. కానీ అందులో వాస్తవం లేదు . అటు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో రవితేజ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో దీనిపై కూడా స్పష్టత లభిస్తుంది.