Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఆ ఐదుగురు సెలబ్రిటీస్ ఫిక్సా..?

బిగ్ బాస్ సీజన్ 9 మరో 10 రోజుల్లో మొదలు కాబోతుంది. బిగ్ బాస్ ఈసారి సీజన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని హోస్ట్ నాగార్జున చెబుతున్నారు.

By:  Ramesh Boddu   |   28 Aug 2025 10:21 AM IST
బిగ్ బాస్ 9.. ఆ ఐదుగురు సెలబ్రిటీస్ ఫిక్సా..?
X

బిగ్ బాస్ సీజన్ 9 మరో 10 రోజుల్లో మొదలు కాబోతుంది. బిగ్ బాస్ ఈసారి సీజన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని హోస్ట్ నాగార్జున చెబుతున్నారు. ఇప్పటికే ప్రోమోస్ బిగ్ బాస్ లవర్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనడానికి కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక షో కండక్ట్ చేస్తున్నారు. దాని నుంచి బిగ్ బాస్ లో పాల్గొనే ఐదుగురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ లిస్ట్ కూడా క్రేజీగా ఉండబోతుంది.

సీజన్ 9 లో సెలబ్రిటీస్ కేటగిరిలో..

ఈసారి సెలబ్రిటీస్ కి కామన్ మ్యాన్ మధ్య గట్టి పోటీ ఏర్పడేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ కేటగిరిలో ఇప్పటికే ఆరుగురు దాదాపు కన్ ఫర్మ్ అంటున్నారు. అందులో జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ ఉన్నట్టు తెలుస్తుంది. జబర్దస్త్ షోలో తన కామెడీతో అలరించిన ఇమ్మాన్యుయెల్ కి బిగ్ బాస్ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. సో అతను ఈ సీజన్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9 లో సీరియల్ హీరోయిన్ తనూజ దాదాపు కన్ ఫర్మ్ అంటున్నారు. సీరియల్ యాక్టర్ భగత్ కూడా వస్తున్నాడట. ఇక ఒకప్పటి హీరోయిన్ ఆశా శైనీ కూడా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొంటుందని తెలుస్తుంది. ఇక వీరితో పాటు అలేఖ్య పికిల్స్ రమ్యని కూడా సెలబ్రిటీ కేటగిరి కింద ఈ సీజన్ కి తీసుకొస్తున్నారట. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీస్ లిస్ట్ ఇలా ఉంటే కామ మ్యాన్ గా ఆల్రెడీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఆట మొదలు పెట్టారు.

ఆట రసవత్తరంగా..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి ఉన్న 15 మందులో ఐదుగురు హౌస్ లోకి వచ్చే ఛాన్స్ అందుకుంటారు. ఐతే ఆ అవకాశం ఎవరికి వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో రెండు గ్రూపులు రెండు హౌస్ లు ఉంటాయట. సో ఈసారి ఆట నిజంగానే రసవత్తరంగా మారబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 టాస్కుల విషయంలో కూడా చాలా టఫ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సీజన్ 9 షో మొదలు కాకముందే సందడి బాగుంది. సో బిగ్ బాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ పక్కా అనిపించేలా ఉందని చెప్పొచ్చు.