Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. వెనక మాటలు ఆడియన్స్ చూస్తారని తెలియదా..?

తనకు ఎలాంటి ఎమోషన్ ఉన్నా మొహం మీద చెప్పేసే వాళ్లనే ఆడియన్స్ ఇష్టపడతారు. ముఖ్యంగా తనతో ఒక మంచి రిలేషన్ షిప్ ఉన్న వారి గురించి వాళ్లు లేని సందర్భంలో మాట్లాడితే అది కరెక్ట్ అనిపించదు.

By:  Ramesh Boddu   |   13 Dec 2025 3:42 PM IST
బిగ్ బాస్ 9.. వెనక మాటలు ఆడియన్స్ చూస్తారని తెలియదా..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ వీక్ కు అంతా సిద్ధమయ్యారు. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. వారిలో నుంచి సింగిల్ లేదా డబల్ ఎలిమినేషన్ అన్నది ఈ వీకెండ్ జరుగుతుంది. ఇక టాప్ 5 ఫైనల్ వీక్ ని హౌస్ లో గడుపుతారు. వారిలో నుంచి టాప్ 2 ఆ ఇద్దరిలో టైటిల్ విన్నర్ ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో సీరియల్ స్టార్ భరణి టాప్ 5లో ఉంటాడా లేదా అన్న డిస్కషన్ కొనసాగుతుంది. సీజన్ 9లో వన్ ఆఫ్ ది స్టార్ కంటెస్టెంట్ గా ఆయన వచ్చారు. ఐతే అతని బాండింగ్స్ వల్ల అతను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

భరణి ఫన్ సైడ్ ఓపెన్..

ఆటలో కూడా భరణి అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. ఐతే మళ్లీ రీ ఎంట్రీ తర్వాత ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు తన ఫన్ సైడ్ ఓపెన్ అయ్యాడు. అది ఆడియన్స్ కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు. ఐతే ఈ వారం భరణి ఆట ఇంప్రెస్ చేసింది. తనూజ కి తన పాయింట్స్ ఇచ్చిన భరణి నాన్న అన్నందుకు నీ సంతోషం కోరుకుంటా అని అన్నాడు. ఐతే అంతవరకు బాగుంది కానీ తనూజ వచ్చి తనకు సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు ఆమె ముందు బాగానే మాట్లాడి ఆమె వెళ్లాక ఆమెను వెక్కిరిస్తూ భరణి మాట్లాడటం ఆకట్టుకోలేదు.

తనకు ఎలాంటి ఎమోషన్ ఉన్నా మొహం మీద చెప్పేసే వాళ్లనే ఆడియన్స్ ఇష్టపడతారు. ముఖ్యంగా తనతో ఒక మంచి రిలేషన్ షిప్ ఉన్న వారి గురించి వాళ్లు లేని సందర్భంలో మాట్లాడితే అది కరెక్ట్ అనిపించదు. ఇది ఆడియన్స్ చూస్తున్నారన్న విషయం భరణికి తెలియదా అంటే తెలుసు కానీ అక్కడ ఆయన చేసిందే కరెక్ట్ అనేలా ఆడియన్స్ ఫీల్ అయ్యేందుకు అలా ప్రయత్నించారని చెప్పొచ్చు.

లీడర్ బోర్డ్ టాస్క్ లో విజేతగా తనూజ..

హౌస్ లో ఫైనల్ వీక్ లీడర్ బోర్డ్ టాస్క్ లో విజేతగా నిలిచి తనూజ రెండో ఫైనలిస్ట్ అయ్యింది. ఐతే తను గెలుచుకున్న ఆ 3 లక్షలు ప్రైజ్ మనీలో కట్ అవుతాయని చెప్పగానే ఆమె ఆడియన్స్ ఓటింగ్స్ ద్వారానే వెళ్తానని చెప్పి సర్ ప్రైజ్ చేసింది. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నా ఆడియన్స్ ఎవరిని ఫైనల్ కి చేర్చాలి ఎవరిని విజేత చేయాలి అన్నది క్లారిటీకి వస్తున్నారు.

ఇక టాప్ 5లో భరణి సంజనా ఇద్దరిలో ఎవరు వెళ్తారన్నది ఆడియన్స్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇద్దరిని ఉంచాలనే ప్లాన్ ఉంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 కాదు టాప్ 6 ని ప్లాన్ చేసినా సరే భరణి, సంజనా ఫ్యాన్స్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంటుంది.