Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్‌ 10X ముహూర్తం ఫిక్స్‌

నాగార్జున లుక్‌తో పాటు, అన్ని విషయాల్లోనూ చాలా మార్పులను బిగ్‌బాస్ 10లో చూస్తారని నిర్వాహకులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

By:  Ramesh Palla   |   29 Aug 2026 11:22 AM IST
బిగ్‌బాస్‌ 10X ముహూర్తం ఫిక్స్‌
X

తెలుగు బిగ్‌బాస్ సందడి మరోసారి ప్రారంభం కాబోతుంది. ఈసారి సీజన్ 10 కావడంతో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపించి మరీ షో ను రన్‌ చేయబోతున్నారు. ఇక ప్రేక్షకులు సైతం షో ను చూసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. ఇప్పటికే ఏడు సీజన్‌లకు హోస్ట్‌గా వ్యవహరించిన టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఈ స్పెషల్‌ సీజన్‌ కి సైతం హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఎన్టీఆర్‌ ఒక సీజన్‌కి, నాని ఒక సీజన్‌కు హోస్టింగ్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత వారికి బిగ్‌బాస్ హోస్టింగ్‌ సాధ్యం కాలేదు. ఎవరు బిగ్‌బాస్‌కి సరైన హోస్ట్‌ అని ఎదురు చూస్తున్న సమయంలో తెలుగు ప్రేక్షకుల చెంతకు బిగ్‌బాస్‌ను మరింతగా తీసుకు వెళ్లేందుకు నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. సీజన్‌ 3 నుంచి సీజన్‌ 9 వరకు బిగ్‌బాస్‌ ను నాగ్‌ నడిపించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు బిగ్‌బాస్ అంటే నాగార్జున... నాగార్జున అంటే బిగ్‌ బాస్ అనుకునే స్థాయిలో హోస్టింగ్‌ చేసి అలరించాడు.

తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 10..

బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం అయ్యే ప్రతిసారి హడావిడి పెద్ద ఎత్తున ఉంటుంది. గత సీజన్‌ నుంచి రెండు నెలల ముందు నుంచే అగ్నిపరీక్ష అంటూ ఒక షో ను పెట్టి, అందులో నుంచి సామాన్యులను ఇద్దరు ముగ్గురుని ఎంపిక చేసి బిగ్‌బాస్‌ షో కి పంపిస్తున్నారు. కనుక ఈసారి కూడా తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10 కోసం సామాన్యులను కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జరుగుతోంది. షో కి మంచి స్పందన వస్తోంది. మెల్ల మెల్లగా అక్కడ నుంచి కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అవుతూ ఫైనల్‌కి చేరుకుంటున్నారు. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 10 ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా స్టార్‌ మా, బిగ్‌బాస్‌ నిర్వాహకులు గుడ్‌ న్యూస్ చెప్పారు. నాగార్జున బర్త్‌డే సందర్భంగా కొత్త ప్రోమోను విడుదల చేయడంతో పాటు, సెప్టెంబర్‌ 6 నుంచి అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. గ్రాండ్‌ లాంచ్ ఎపిసోడ్‌ మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంటుందని తెలుస్తోంది.

నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్‌

నాగార్జున లుక్‌తో పాటు, అన్ని విషయాల్లోనూ చాలా మార్పులను బిగ్‌బాస్ 10లో చూస్తారని నిర్వాహకులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఈసారి ప్రేక్షకులు ఊహించిన దానికి పది రెట్లు అధనంగా థ్రిల్‌ ఫీల్‌ అవుతారని, పది రెట్లు డ్రామా ఉంటుందని, బిగ్‌బాస్ వినోదం ఈసారి పది రెట్లు ఉంటుందని నాగార్జున హామీ ఇస్తున్నాడు. 10X అంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారు బిగ్‌బాస్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ షార్ట్‌ లిస్ట్‌ పూర్తి అయింది. ఒకటి రెండు రోజుల్లో కంటెస్టెంట్స్ అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెట్టి డాన్స్‌ ప్రాక్టీస్‌ ను సైతం ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ నిర్వాహకులు ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది ఈసారి హౌస్‌లో ఉంటారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అగ్నిపరీక్ష షో ద్వారా ఎంపిక అయిన వారికి..

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో ద్వారా కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతే కాకుండా రెండు మూడు వారాల తర్వాత అగ్నిపరీక్ష లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో ఒకరిని వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చే విషయాన్ని కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు పరిశీలిస్తున్నారట. మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 10 కచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేయడం ఖాయం అని, అలాగే ఈసారి వీకెండ్‌ ఎపిసోడ్స్ 10X వినోదాన్ని ఇవ్వడం ఖాయం అని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నాగార్జున హోస్టింగ్‌ చేయబోతున్న చివరి సీజన్‌ అనే పుకార్లు గుప్పుమంటున్నాయి. ఈ సీజన్‌తో నాగార్జునకు బిగ్‌ సెండాఫ్ ఇవ్వాలని నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారట. అంతే కాకుండా గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌కు నాగార్జున భారీ పారితోషికం అందుకుంటాడని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి అన్ని విధాలుగా బిగ్‌బాస్‌ 10 చాలా స్పెషల్‌గా నిలవడం ఖాయం అని విశ్లేషకులు, ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.